Hyderabad: మలక్‌పేట పివిఆర్ కాంప్లెక్స్ లిఫ్ట్‌లో చిక్కుకున్న గర్భిణి సహా 12 మంది..
హైదరాబాద్ లో పెను ప్రమాదం తప్పింది. మలక్ పేట పివిఆర్ కాంప్లెక్స్ లో లిఫ్ట్ మొరాయించడంతో లిఫ్ట్ లో ప్రయాణిస్తున్న వారు భయాందోళనకు గురయ్యారు.
- Author : Praveen Aluthuru
Date : 05-07-2023 - 2:45 IST
Published By : Hashtagu Telugu Desk
Hyderabad: హైదరాబాద్ లో పెను ప్రమాదం తప్పింది. మలక్ పేట పివిఆర్ కాంప్లెక్స్ లో లిఫ్ట్ మొరాయించడంతో లిఫ్ట్ లో ప్రయాణిస్తున్న వారు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమయానికి అందులో 12 మంది ఉన్నట్టు గుర్తించారు. అయితే అందులో ఓ గర్భిణీ స్త్రీ కూడా ఉండటంతో అందరూ ఆందోళన చెందారు. ఇది గమనించిన కాంప్లెక్ సిబ్బంది ఫైర్ సిబ్బందికి, స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఫైర్ సిబ్బంది హుటాహుటిన పీవీఆర్ కాంప్లెక్స్ కు చేరుకొని పోలీసులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. కొంత సేపటికే లిఫ్ట్ తెరుచుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సాంకేతిక సమస్యలతో జనంతో వెళ్తున్న లిఫ్ట్ మార్గమధ్యంలో ఆగిపోయిందని చెప్పారు. అగ్నిమాపక అధికారి ముస్తఫా, ఫైర్‌మెన్ అంజిరెడ్డి మరియు వారి సిబ్బంది రంగంలోకి దిగి లిఫ్ట్ డోర్ తెరిచి అందరినీ విజయవంతంగా రక్షించారు.
Read More: Kishan Reddy: కిషన్ రెడ్డి అలక.. మోడీ కేబినెట్ సమావేశానికి గైర్హాజరయ్యారు.