12 Killed : నైజీనియాలో దారుణం.. ఇమామ్‌తో సహా 12 మందిని హతమార్చిన ముష్కరులు
నైజీరియాలో దారణ సంఘటన జరిగింది. ఓ మసీదులో ముష్కరులు ఇమామ్‌తో సహా 12 మందిని హతమార్చారు. శనివారం రాత్రి..
- By Prasad Published Date - 08:24 AM, Mon - 5 December 22

నైజీరియాలో దారణ సంఘటన జరిగింది. ఓ మసీదులో ముష్కరులు ఇమామ్‌తో సహా 12 మందిని హతమార్చారు. శనివారం రాత్రి మసీదు నుండి అనేక మందిని కిడ్నాప్ చేశారని స్థానిక నివాసితులు తెలిపారు. ముష్కరులు మోటర్‌బైక్‌లపై మైగామ్‌జీ మసీదు వద్దకు వచ్చి అడపాదడపా కాల్పులు జరపడం ప్రారంభించారని..దీంతో ఆరాధకులు పారిపోవలసి వచ్చిందని స్థానికులు తెలిపారు. రాత్రి ప్రార్థనలకు హాజరైన సుమారు 12 మంది కాల్పుల్లో చిక్కుకుని, చీఫ్ ఇమామ్‌తో సహా మరణించారని తెలిపారు. కట్సినా రాష్ట్ర పోలీసు ప్రతినిధి గాంబో ఇసా ఈ దాడిని ధృవీకరించారు.