Rajkot Fire: రాజ్‌కోట్ గేమింగ్ జోన్ ప్రమాదంపై సిట్ నివేదిక
రాజ్‌కోట్ గేమింగ్ జోన్ ఘటనపై సిట్ శుక్రవారం గుజరాత్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మే 25న రాజ్‌కోట్ గేమ్ జోన్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై విచారణకు గుజరాత్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం శుక్రవారం గాంధీనగర్‌లో హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘ్వీకి తన నివేదికను సమర్పించింది.
- By Praveen Aluthuru Published Date - 10:55 PM, Fri - 21 June 24

Rajkot Fire: రాజ్‌కోట్ గేమింగ్ జోన్ ఘటనపై సిట్ శుక్రవారం గుజరాత్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మే 25న రాజ్‌కోట్ గేమ్ జోన్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై విచారణకు గుజరాత్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం శుక్రవారం గాంధీనగర్‌లో హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘ్వీకి తన నివేదికను సమర్పించింది.
రాజ్‌కోట్ గేమింగ్ జోన్ ఘటనకు సంబంధించి జరిపిన దర్యాప్తులో ప్రాథమిక నివేదికలో అనేక లోపాలను ఎత్తి చూపారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఇందులో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ తో పాటు ఫైర్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ నిర్లక్ష్యాన్ని ప్రస్తావించారు. గేమింగ్ జోన్ నిర్వాహకులు చట్టాన్ని పట్టించుకోకుండా గేమింగ్ జోన్‌ను నడుపుతున్నారు. ఉన్నతాధికారుల పాత్ర కూడా అనుమానాస్పదంగా ఉందన్నారు.
మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల హస్తం ఉంది. అధికారులు కార్పొరేషన్‌లో ఉంటూ నల్లధనాన్ని ఎలా సంపాదిస్తున్నారనే అంశం సిట్ నివేదించింది. దీంతో పాటు కొన్ని సూచనలు కూడా చేశారు. సీనియర్ ఐపిఎస్ అధికారి సుభాష్ త్రివేది నేతృత్వంలోని సిట్ తన 100 పేజీల మధ్యంతర నివేదికలో గుజరాత్ పోలీసు చట్టం (జిపి యాక్ట్)లోని సెక్షన్ 33లో కొన్ని మార్పులను సూచించింది.
Also Read: Gopichand Viswam : గోపీచంద్ విశ్వంకు భారీ డీల్..!