Odisha Road Accident: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం: పది మంది మృతి
ఒడిశాలో ఈ రోజు ఇవాళ తెల్లవారుజాము ఘోర రోడ్డు ప్రమాదం వెలుగు చూసింది. గంజాం జిల్లాలో నిన్న రాత్రి జరిగిన బస్సు ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, 8 మంది గాయపడ్డారు.
- By Praveen Aluthuru Published Date - 07:58 AM, Mon - 26 June 23

Odisha Road Accident: ఒడిశాలో ఈ రోజు తెల్లవారుజాము ఘోర రోడ్డు ప్రమాదం వెలుగు చూసింది. గంజాం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, 8 మంది గాయపడ్డారు.
వివరాల ప్రకారం గంజాం జిల్లాలోని దిగపహండి సమీపంలో ఒడిశా ఆర్టీసీ బస్సు, ప్రైవేటు బస్సు ఢీ కొన్నాయి. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో పది మంది అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని బెర్హంపూర్‌లోని MKCG మెడికల్ కాలేజీలో చేర్చారు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నామని స్థానిక పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read More: 2 Killed : ముంబైలో భారీ వర్షాలకు కూలిన భవనం.. ఇద్దరు మృతి