Maharashtra Building Collapse : మహారాష్ట్రలో భవనం కూలి ఒకరు మృతి.. మరొకరికి గాయాలు
మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ఉల్హాస్‌నగర్ పట్టణంలో విషాదం నెలకొంది.
- Author : Prasad
Date : 18-09-2022 - 9:50 IST
Published By : Hashtagu Telugu Desk
మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ఉల్హాస్‌నగర్ పట్టణంలో విషాదం నెలకొంది. భవనంలోని ఒక భాగం పక్క ఇంటిపై కూలిపోవడంతో 65 ఏళ్ల వ్యక్తి మరణించాడు. అతని భార్య గాయపడినట్లు పోలీసులు తెలిపారు. కాశీరామ్ చౌక్ ప్రాంతంలో ఉదయం 8.15 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని, భవనంలోని కొంత భాగం పక్కనే ఉన్న ఇంటిపై పడిందని పోలీసులు తెలిపారు. గోపాల్ గబ్డా అనే వ్యక్తి మరణించగా.. అతని భార్య బర్ఖా (62) గాయపడ్డారు