Coconut Water: కొబ్బరి బోండంలోకి నీళ్లు ఎలా చేరుతాయి ? వేళ్ల నుంచి టెంకలోకి దారేది ?
కొబ్బరి బోండంలోకి(Coconut Water) నీళ్లు ఎలా చేరుతాయి ? ఎక్కడి నుంచి చేరుతాయి ? అనేది తెలుసుకునే ముందు మనం కొబ్బరి బోండం నిర్మాణం గురించి తెలుసుకుందాం.
- By Pasha Published Date - 07:51 PM, Mon - 14 April 25

Coconut Water: సమ్మర్ సీజన్‌లో మనం కూల్‌డ్రింక్స్ తాగడం మంచిది కాదు. ఎందుకంటే వాటిలో కలర్స్, చక్కెర అధిక మోతాదులో ఉంటాయి. కూల్ డ్రింక్స్ కంటే కొబ్బరి బోండాలు తాగడం చాలా బెస్ట్. కూల్ డ్రింక్స్ తాగితే మన జేబులోని డబ్బు బడా కంపెనీలకు చేరుతుంది. కొబ్బరి బోండాలను తాగితే.. మన డబ్బులు రైతన్నల వద్దకు చేరుతాయి. పైగా కొబ్బరి బోండాలు నేచురల్. వాటి నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. మన శరీరానికి తగినంత చలువ లభిస్తుంది. ఎన్నో పోషకాలమయంగా ఉండే కొబ్బరి నీళ్లను తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.ఇంతకీ కొబ్బరి బోండంలోకి నీళ్లు ఎలా చేరుతాయి ? ఎక్కడి నుంచి చేరుతాయి ? అనే ఆసక్తికర సమాచారాన్ని మనం ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Golconda Blue : ‘గోల్కొండ బ్లూ’ వజ్రం వేలం.. చరిత్ర తెలుసా ?
ఏ కొబ్బరి బోండంలో ఎక్కువ నీళ్లు ఉంటాయి ?
- కొబ్బరి బోండంలోకి(Coconut Water) నీళ్లు ఎలా చేరుతాయి ? ఎక్కడి నుంచి చేరుతాయి ? అనేది తెలుసుకునే ముందు మనం కొబ్బరి బోండం నిర్మాణం గురించి తెలుసుకుందాం.
- కొబ్బరికాయలో ఎక్సోకార్ప్, మీసోకార్ప్, ఎండోకార్ప్ అనే మూడు పొరలు ఉంటాయి.
- కొబ్బరికాయ పైపొరను ఎక్సోకార్ప్ అని పిలుస్తాం. ఇది ఆకుపచ్చ రంగులో మెత్తగా ఉంటుంది. దీని కింద పీచులా ఉండే పొట్టును మీసోకార్ప్ అంటారు.
- కొబ్బరి టెంకను ఎండోకార్ప్ అంటారు. కొబ్బరి బోండం లోపలి తెల్లని గుజ్జును ఎండోకార్ప్ రక్షిస్తుంది. ఎండోకార్ప్‌లో రెండు భాగాలు ఉంటాయి. వీటిలో ఒకటి గుజ్జు (ఎండో స్పెర్మ్), రెండోది టెంకలోని నీరు.
- కొబ్బరి బోండంలోని గుజ్జును ఎండోస్పెర్మ్ అంటారు. ఇది లేత కొబ్బరికాయలో మృదువుగా జెల్లీలా ఉంటుంది.
- కొబ్బరికాయ ఎదిగే క్రమంలో టెంకలో సహజంగానే నీరు ఏర్పడుతుంది.
- కొబ్బరి కాయ ముదిరినకొద్దీ.. దానిలోని గుజ్జు (ఎండో స్పెర్మ్) గట్టి పడుతుంది.
- ఆకుపచ్చని రంగులో లేతగా ఉండే కొబ్బరికాయలో ఎక్కువ నీరు ఉంటుంది.
- ముదిరిన తర్వాత గోధుమ రంగులోకి మారిన కొబ్బరి బోండంలో తక్కువ నీళ్లు , ఎక్కువ గుజ్జు ఉంటాయి.
Also Read :Vivek Vs Premsagar : అధిష్ఠానం అన్యాయం చేస్తే సహించను.. ప్రేమ్‌సాగర్‌రావు సంచలన వ్యాఖ్యలు
కొబ్బరి బోండంలోని టెంకలోకి నీరు ఎలా వస్తుంది?
- కొబ్బరి చెట్టులో వాస్క్యులర్ వ్యవస్థ ఉంటుంది. ఇదే కొబ్బరి చెట్టు వేళ్ల నుంచి బోండంలోకి నీటిని, పోషకాలను చేరవేస్తుంది.
- కొబ్బరి చెట్టులోని వాస్క్యులర్ వ్యవస్థలో జైలమ్ అనే నాళాలు వ్యాపించి ఉంటాయి.
- కొబ్బరి చెట్టు వేళ్లు దాదాపు 1 నుంచి 5 మీటర్ల లోతు దాకా భూమిలో వ్యాపించి ఉంటాయి.
- ఈ వేళ్లు చుట్టుపక్క నేల నుంచి పోషకాలతో కూడిన భూగర్భజలాలను గ్రహిస్తాయి.
- తదుపరిగా ఈ నీరు కొబ్బరి చెట్టు కాండం ద్వారా పైకి రవాణా అవుతుంది. చివరకు కొబ్బరికాయలోకి చేరుతుంది.
- కొబ్బరికాయలోని టెంక భాగం(ఎండోకార్ప్) ఈ నీటిని నిల్వ చేస్తుంది.
- కొబ్బరి కాయ ముదిరేకొద్దీ నీళ్లు తగ్గిపోయి, తెల్లటి గుజ్జు (కొబ్బరి) తయారవుతుంది.