Lal Bahadur Shastri : ‘జై జవాన్.. జై కిసాన్’ రూపశిల్పికి జైజై
Lal Bahadur Shastri : లాల్ బహాదుర్ శాస్త్రి మన దేశ రెండో ప్రధానమంత్రి. ఇవాళ ఆయన జయంతి.
- By Pasha Published Date - 08:20 AM, Mon - 2 October 23
Lal Bahadur Shastri : లాల్ బహాదుర్ శాస్త్రి మన దేశ రెండో ప్రధానమంత్రి. ఇవాళ ఆయన జయంతి. ఉత్తరప్రదేశ్‌లోని మొఘల్ సరాయ్ గ్రామంలో 1904 అక్టోబర్ 2న లాల్ బహాదుర్ శాస్త్రి జన్మించారు. మనం ఈనాడు గొప్పగా చెప్పుకుంటున్న ‘జై జవాన్.. జై కిసాన్’ నినాదం ఇచ్చింది ఆయనే. ఇండో-పాక్ వార్ సమయంలో ఆయన ఈ స్లోగన్ ఇచ్చారు. మెట్రిక్యులేషన్ చదువుతున్న రోజుల్లోనే గాంధీ, పండిట్ మదన్ మోహన్ మాలవ్య నేతృత్వంలో జరిగిన ఓ స్వాతంత్య్ర సమరభేరి సభకు హాజరైన లాల్ బహదూర్ శాస్త్రి.. వారి ప్రసంగాలకు ఆకర్షితులై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో స్టూడెంట్ వాలంటీర్‌గా చేరారు. అప్పటి నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ప్రజల కోసమే జీవితాన్ని అంకితం చేశారు. 1921లో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో 9 సంవత్సరాలపాటు జైలులోనే గడిపారు. యాదృచ్ఛికంగా గాంధీ పుట్టిన రోజు.. లాల్ బహదూర్ శాస్త్రి బర్త్‌డే కూడా ఒకటే రోజు ఉండటం మరో విశేషం.
Also read : ESIC Online Link Available: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1038 ఉద్యోగాలకు నోటిఫికేషన్..!
1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా (1951–56) లాల్ బహాదుర్ శాస్త్రి పనిచేశారు. ఓ రైలు ప్రమాదం జరిగితే.. దానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. ఆ తరువాత హోంమంత్రిగానే కాక ఇతర బాధ్యతలను కూడా చేపట్టాడు. 1964లో జవహర్ లాల్ నెహ్రూ ఆకస్మిక మరణం తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యారు. 1965 ఇండో-పాకిస్థాన్ యుద్ధం కాలంలో దేశాన్ని లాల్ బహాదుర్ శాస్త్రి నడిపించారు. ఈ యుద్ధం 1966 జనవరి 10న తాష్కెంట్ ఒప్పందంతో ముగిసింది. పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్, భారత్ మధ్య ఒప్పందం జరిగిన మరుసటి రోజే (1966 జనవరి 11న) తాష్కెంట్లో లాల్ బహాదుర్ శాస్త్రి గుండెపోటుతో మరణించారు. అయూబ్ ఖాన్ తో సమావేశం ముగిసిన కొన్ని గంటలకే శాస్త్రి మరణించారు.ఈ మరణానికి అనేక కారణాలు చెప్పబడినప్పటికీ.. అది అమెరికా నిఘా సంస్థ సీఐఏ ద్వారా జరిగిన ప్రణాళికాబద్ధమైన హత్యగా (Lal Bahadur Shastri) కొందరు చెబుతుంటారు. మరణానంతరం 1966లో భారత ప్రభుత్వం ఆయనకు ‘భారతరత్న’ ఇచ్చి గౌరవించింది.
Related News
Monkey : గాంధీ జయంతి రోజున..కోతికి దొరికిన మందు బాటిల్..
ఓ కోతి కి మాత్రం గాంధీ జయంతి రోజున మందు బాటిల్ చేతికి చిక్కింది. అది కూడా ఎక్కడో కాదు...పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదురుగా..ప్రస్తుతం దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.