Parents Day : అమ్మానాన్నలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఒకరోజు
ఇవాళ(జులై 28) నేషనల్ పేరెంట్స్ డే. అమ్మానాన్నలను అభినందించేందుకు, కృతజ్ఞతలు తెలిపేందుకు, సెల్యూట్ చేసేందుకు ఈరోజు స్పెషల్ డే.
- By Pasha Published Date - 09:36 AM, Sun - 28 July 24

Parents Day : ఇవాళ(జులై 28) నేషనల్ పేరెంట్స్ డే. అమ్మానాన్నలను అభినందించేందుకు, కృతజ్ఞతలు తెలిపేందుకు, సెల్యూట్ చేసేందుకు ఈరోజు స్పెషల్ డే. ప్రతి సంవత్సరం జులై నెల నాలుగో ఆదివారం రోజున నేషనల్ పేరెంట్స్ డేను జరుపుకుంటారు. 1994 సంవత్సంలో ఆనాటి అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్ ఫాదర్స్ డే, మదర్స్‌డేలను రద్దు చేశారు. తల్లిదండ్రుల(National Parents Day) విషయంలో లింగభేదం ఉండరాదని ఆయన అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. వాటి స్థానంలో ఏటా జులై నెలలో 4వ ఆదివారాన్ని జాతీయ తల్లిదండ్రుల దినోత్సవంగా నిర్వహించాలని క్లింటన్ తీర్మానించారు. ఈ నిర్ణయాన్ని అమెరికా సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది. అప్పటినుంచే ప్రపంచదేశాల్లో తల్లిదండ్రుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పిల్లల జీవితాలకు బంగారు బాటలు వేసేది తల్లిదండ్రులే. పిల్లలు సాధించే గొప్ప విజయం వెనుక వెన్నెముకలా నిలిచే దీపకాంతులు తల్లిదండ్రులు(Parents Day). వారి నిస్వార్థ ప్రేమ గురించి, త్యాగనిరతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. అలాంటి అమ్మానాన్నలకు పిల్లలు ఎంత సేవ చేసినా తక్కువే.
We’re now on WhatsApp. Click to Join
పిల్లలు ఉన్నా అనాథలుగా..
కొందరు పిల్లలు తమ అమ్మానాన్నలు అనాథలుగా మిగులుస్తున్నారు. వారిని వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు. తల్లిదండ్రుల పట్ల ప్రతిఒక్కరూ బాధ్యతగా మెలగాలి. వృద్ధాప్యంలో ఒక తోడు కోసం.. ఓ తియ్యని పలుకు కోసం అల్లాడిపోయ్యే తల్లిదండ్రులకు ఆప్యాయతను పంచాల్సిన బాధ్యత వారి పిల్లలదే. భార్య చెప్పిందనో.. ఆమె బాధపడుతుందనో, కుటుంబ స్థితిగతులు బాగలేవనో తల్లిదండ్రులను దూరం చేసుకుంటే భవిష్యత్‌లో తమ పిల్లలు కూడా తమను అలాగే చూస్తారన్న విషయాన్ని గుర్తించుకోవాలి. తల్లిదండ్రుల పట్ల ప్రేమతో మెలిగే వారికే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది.
Also Read :Flood : నీట మునిగిన కోచింగ్ సెంటర్ బేస్మెంట్.. ముగ్గురు అభ్యర్థులు మృతి
తల్లిదండ్రుల సంరక్షణ కోసం చట్టం ..
సంపాదన లేని తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ కోసం కేంద్ర ప్రభుత్వం 2007లో ‘‘మెయింటెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్-2007’’ తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం 60 ఏళ్లకు పైబడిన ప్రతి ఒక్కరి సంరక్షణ, పోషణ చూడాల్సిన బాధ్యత వాళ్ల పిల్లలు లేదా చట్టప్రకారం నిర్ధారణ పొందిన బంధువులపై ఉంటుంది. ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేస్తూ పిల్లలు అనే నిర్వచనానికి పరిధి విస్తృత పరిచారు. దీని ప్రకారం పిల్లలు అనే అర్థంలో అల్లుల్లు, కోడళ్లు, మనవళ్లు, దత్తత తీసుకున్న లేదా సవతి తల్లి పిల్లలు, చట్టబద్ధమైన సంరక్షకుల వద్ద ఉన్న మైనర్లు కూడా వస్తారు. ఒకప్పుడు వృద్ధుల పోషణకు సంబంధించి నెలకు రూ.10వేలు పిల్లలు ఇవ్వాలనే నిబంధన ఉండేది. అయితే ప్రస్తుత చట్టాల ప్రకారం ఈ నిర్ణీత పోషణ ఖర్చులను ఎత్తివేశారు. పిల్లలు తమ ఆదాయాన్ని బట్టి ఈ మొత్తాన్ని ఇవ్వొచ్చు. ఆహారం, దుస్తులు, నివాసం, వైద్య సహకారాన్ని పిల్లలు తప్పకుండా అందించాల్సి ఉంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తల్లిదండ్రులు, వృద్ధులైన బంధువుల సంరక్షణ, పోషణ చూడకుండా నిర్లక్ష్యంగా వదిలేసినా ఆరు నెలల జైలు శిక్ష ఉంటుంది.