HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >That One Decision Is The Key Reason For The Downfall Of Pakistan In Space Research

Space Research – Pakistan Downfall : స్పేస్ రీసెర్చ్ లో పాకిస్తాన్ ను పతనం చేసిన.. ఆ ఒక్క నిర్ణయం!

Space Research - Pakistan Downfall : మన దేశం స్పేస్ రీసెర్చ్ లో దూసుకుపోతోంది.అగ్ర రాజ్యాలు అమెరికా, చైనా, రష్యాతోనూ పోటీపడుతోంది. 

  • By Pasha Published Date - 09:04 AM, Fri - 25 August 23
  • daily-hunt
Space Research Pakistan Downfall
Space Research Pakistan Downfall

Space Research – Pakistan Downfall : మన దేశం స్పేస్ రీసెర్చ్ లో దూసుకుపోతోంది.

అగ్ర రాజ్యాలు అమెరికా, చైనా, రష్యాతోనూ పోటీపడుతోంది. 

తాజాగా ఆగస్టు 23న చంద్రయాన్-3 సక్సెస్ తో మన ఇస్రో  ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. 

పొరుగు దేశం పాకిస్తాన్ మాత్రం ఈవిషయంలో చాలా వెనుకంజలో ఉంది. 

వాస్తవానికి మన దేశంలో స్పేస్ రీసెర్చ్ కోసం ప్రత్యేక సంస్థ ‘ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్’ (INCOSPAR) 1962 ఫిబ్రవరి 23న ఏర్పాటైంది. 

దీనికి ఒక ఏడాది ముందే (1961లో) .. పాకిస్థాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ  ‘SUPARCO’ (స్పేస్ అండ్ అప్పర్ అట్మాస్పియర్ రీసెర్చ్ కమిషన్)ను స్థాపించారు. 

అయితే అంతరిక్ష  పరిశోధనా రంగంలో పాకిస్తాన్ జాడ ఎందుకు గల్లంతైంది ? దీనికి ఒక బలమైన కారణముంది.. తెలుసుకుందాం రండి.

Also read : Trumps Mug Shot : డొనాల్డ్ ట్రంప్ ఖైదీ నంబర్ ‘P01135809’.. జైలులో దిగిన ‘మగ్ షాట్’ ఫొటో వైరల్

జుల్ఫికర్ అలీ భుట్టో ఒక్క నిర్ణయంతో ‘SUPARCO’ ఢమాల్ 

పాకిస్థాన్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త  డాక్టర్ అబ్దుస్ సలామ్ 1961 సంవత్సరంలో ‘SUPARCO’ (స్పేస్ అండ్ అప్పర్ అట్మాస్పియర్ రీసెర్చ్ కమిషన్)ను స్థాపించారు. పాకిస్థాన్ అణ్వాయుధాలను సమకూర్చుకోవడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. 1960 నుంచి 1974 వరకు పాకిస్థాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సలహాదారుగా కూడా ఆయన సేవలు అందించారు.  సుపార్కో ఏర్పాటైన తొలి నాళ్లలో పాకిస్తాన్ లో అంతరిక్ష పరిశోధనల కోసం ముమ్మర కసరత్తు జరిగింది.  పాకిస్థాన్ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు నాసా ట్రైనింగ్ ఇచ్చేలా ‘SUPARCO’ తరఫున  ఆయన ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. మరోవైపు 1970వ దశకం నాటికి పాకిస్తాన్ రాజకీయాలపై మత ప్రభావం పెరిగింది. అహ్మద్ ఖాదియానీ వర్గానికి చెందిన వారు ముస్లింలు కాదంటూ 1974లో నాటి ప్రధానమంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో చట్టం చేశారు. అయితే చూపబోయే ప్రభావాన్ని భుట్టో అంచనా వేయలేకపోయారు. ‘SUPARCO’ వ్యవస్థాపకుడు డాక్టర్ అబ్దుస్ సలామ్ కూడా  అహ్మద్ ఖాదియానీ వర్గానికి చెందినవారే. జుల్ఫికర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కోపంతో (Space Research – Pakistan Downfall) ఆయన ఇంగ్లండ్ కు వలస వెళ్లిపోయారు.

Also read : Root Vegetables: రూట్ వెజిటేబుల్స్ చాలా ఆరోగ్య సమస్యలకి పరిష్కారం.. బరువు, మధుమేహాన్ని నియంత్రించడంలో మేలు..!

పాక్ ను వదిలి వెళ్లిపోయాక.. నోబెల్ బహుమతి

పాక్ ను వదిలి వెళ్లిపోయాక.. 1979లో అబ్దుస్ సలామ్ కు నోబెల్ బహుమతి వచ్చింది. నోబెల్ పురస్కారానికి ఎంపికైన తొలి పాకిస్తానీ, తొలి ముస్లిం ఆయనే. ఆసక్తికర విషయం ఏంటంటే ఆయన గురువు ఓ భారతీయుడు అనిలేందర్ గంగూలీ.  ఇండియా, పాకిస్తాన్ కలిసి ఉన్న టైంలో లాహోర్ లో ఉన్న సనాతన ధర్మ కాలేజీలో అబ్దుస్ సలామ్ చదువుకున్నారు. అక్కడ అబ్దుస్ సలామ్ కు అనిలేందర్ గంగూలీ మ్యాథ్స్ బోధించారు. అబ్దుస్ సలామ్ తన గురువును మర్చిపోలేదు. తనకు నోబెల్ బహుమతి వచ్చాక అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీకి ఒక లెటర్ రాశారు. దయచేసి తన గురువు అనిలేందర్ గంగూలీ అడ్రస్ తెలిస్తే చెప్పాలని ఆ లెటర్ లో రిక్వెస్ట్ చేశారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Abdus Salam
  • Anilender Ganguly
  • downfall of Pakistan
  • INCOSPAR
  • isro
  • key reason
  • one decision
  • pakistan
  • space research
  • Space Research - Pakistan Downfall
  • SUPARCO

Related News

Afghanistan-Pakistan War

Afghanistan-Pakistan War: విషాదం.. ముగ్గురు క్రికెట‌ర్లు దుర్మ‌ర‌ణం!

పాకిస్తాన్ వైమానిక దాడిలో మొత్తం 8 మంది మరణించారు. ఇందులో ఐదుగురు సాధారణ పౌరులు ఉన్నారు. అంతేకాకుండా 7 మంది ఇతర వ్యక్తులు కూడా గాయపడ్డారు.

    Latest News

    • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    • Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు..!

    • IND vs AUS: నిరాశ‌ప‌ర్చిన రోహిత్‌, కోహ్లీ.. మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం!

    • Chinese Physicist Chen-Ning Yang: నోబెల్ అవార్డు గ్రహీత కన్నుమూత!

    • Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. ఇట‌లీలో చిక్కుకున్న ప్ర‌యాణీకులు!

    Trending News

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd