Fact Check: స్టార్ క్రికెటర్ సిరాజ్‌కు విగ్రహాలు.. ఫొటోలు వైరల్
భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు చెందిన కాంస్య విగ్రహాలు సోషల్ మీడియాలో(Fact Check) వైరల్ అవుతున్నాయి.
- By Pasha Published Date - 05:36 PM, Mon - 3 February 25

Fact Checked By newsmeter
ప్రచారం : భారత క్రికెట్ జట్టు బౌలర్ మహ్మద్ సిరాజ్ విగ్రహాలున్న రెండు ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
వాస్తవం: ఆ ప్రచారం తప్పు. అవి ఏఐతో తయారు చేసిన ఫొటోలు.
భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు చెందిన కాంస్య విగ్రహాలు సోషల్ మీడియాలో(Fact Check) వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి వేల సంఖ్యలో లైకులు వెల్లువెత్తుతున్నాయి. బంతిని సిరాజ్ చేతిలో పట్టుకొని చూపిస్తున్న విధంగా రెండు కాంస్య విగ్రహాలు ఉన్నాయి. బీసీసీఐ లోగోను పోలిన లోగోతో కూడిన టీ షర్ట్‌తో ఈ విగ్రహాలు ఉన్నాయి. ఈ ఫొటోలను ఫేస్‌బుక్‌లో “మహ్మద్ సిరాజ్ విగ్రహం (sic)” ( ఆర్కైవ్ ) అనే టైటిల్‌తో షేర్ చేశారు.
ఇలాంటి ప్రచారాలను ఇక్కడ , ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు . ( ఆర్కైవ్ 1 , ఆర్కైవ్ 2 , ఆర్కైవ్ 3 )
వాస్తవ తనిఖీలో ఏం గుర్తించారు ?
- ఈ ప్రచారం తప్పు అని ‘న్యూస్‌మీటర్’ గుర్తించింది. ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (AI)ను ఉపయోగించి ఈ ఫొటోలను తయారు చేసి వైరల్ చేశారు.
- మేం క్రికెటర్ సిరాజ్ పేరుతో ముడిపడిన వివిధ కీలక పదాలను ఉపయోగించి ఇంటర్నెట్‌లో సెర్చ్ చేశాం. అయినా సిరాజ్ విగ్రహం ఏర్పాటుకు సంబంధించిన ఒక్క వార్త కూడా మాకు దొరకలేదు.
- మేం ‘రివర్స్ ఇమేజ్ సెర్చ్’ కూడా చేశాం. సిరాజ్ వైరల్ ఫొటోలను పోలిన విధంగా ఉన్న ఏ ఒక్క ఫొటో కూడా మాకు దొరకలేదు. దీంతో ఆ ఫొటో నిజమైంది కాకపోవచ్చని మేం నిర్ధారణకు వచ్చాం.
- తదుపరిగా వైరల్ అయిన సిరాజ్ ఫొటోలను నిశితంగా పరిశీలించాం. అవి ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్‌తో తయారు చేసిన ఫొటోలు అని గుర్తించాం. ఎలా అంటే.. వాటిలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఫొటోల బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న వస్తువులు, విగ్రహాల లైటింగ్ వంటి అంశాలలో బాగా తేడాలు ఉన్నట్లు మేం గుర్తించాం. అవన్నీ కల్పితం అన్నట్టుగా కనిపించాయి.
- ఈ ఫొటోలు ఏఐతో తయారైనవా ? కాదా ? అనేది తేల్చేందుకు మేం కొన్ని టూల్స్‌ను వినియోగించాం. హైవ్ మోడరేషన్ టూల్‌ను ఉపయోగించి చూడగా.. ఆయా ఫొటోలలో ఏఐ, డీప్ ఫేక్ కంటెంట్ 99.9 శాతం ఉందని తేలింది.
అందువల్ల, మహ్మద్ సిరాజ్ విగ్రహాలతో కూడిన ఫొటోలన్నీ ఏఐతో తయారైనవే అని NewsMeter నిర్ధారించింది. అవి నిజమైనవి కావు.