UP PCS J Result 2022: సివిల్ జడ్జి ఫలితాల్లో 144 ర్యాంక్ సాధించిన శిల్పి గుప్తా
ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జ్యుడీషియల్ సర్వీస్ సివిల్ జడ్జి పరీక్ష-2022 ఫలితాలలో శిల్పి గుప్తా సత్తా చాటింది. ఈ పరీక్షలో ఆమె 144వ ర్యాంకు సాధించింది.
- Author : Praveen Aluthuru
Date : 31-08-2023 - 7:54 IST
Published By : Hashtagu Telugu Desk
UP PCS J Result 2022: ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జ్యుడీషియల్ సర్వీస్ సివిల్ జడ్జి పరీక్ష-2022 ఫలితాలలో శిల్పి గుప్తా సత్తా చాటింది. ఈ పరీక్షలో ఆమె 144వ ర్యాంకు సాధించింది. తండ్రి దివంగత వేదప్రకాష్ గుప్తా తన కూతుళ్లు న్యాయమూర్తులుగా నిరుపేదలకు సాయం చేయాలన్నది ఆయన కల. ఆమె తండ్రి 2010లో మరణించారు. ఆ సమయంలో శిల్పి గుప్తా ఎల్‌ఎల్‌బి చదువుతోంది. ఏదో ఒక రోజు తప్పకుండా మా నాన్నగారి కల నెరవేర్చాలని పట్టుదలతో చదివానని ఆమె తతెలిపింది.
2018 సంవత్సరంలో ఆమె మొదటిసారిగా ఈ పరీక్షను రాశారు. కానీ ఇంటర్వ్యూలో స్వల్ప మార్కుల తేడాతో ఎంపిక కాలేదు. తన సోదరుడు ధీరజ్ ప్రకాష్ గుప్తా అడుగడుగునా తనకు మనో ధైర్యాన్నిచ్చాడని ఆమె అన్నారు. 2022లో రెండోసారి పరీక్షకు హాజరై ఈసారి 144వ ర్యాంక్‌తో విజయం సాధించారు. అందుకే, రక్షాబంధన్ రోజున ఆమె ఈ విజయాన్ని తన సోదరుడి స్ఫూర్తి బహుమతిగా భావిస్తుంది.
రక్షా బంధన్ రోజున తన సోదరుడికి రాఖీ కట్టేందుకు శిల్పి గుప్తా బస్సులో చందౌసికి వెళ్ళింది. ఇక ఆమె సాధించిన విజయానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి కలను నిరవేర్చినందుకు సంతోషంగా ఉందన్నారు. తండ్రి కల గుర్తు చేసుకుని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.
Also Read: Tollywood : ‘ఒరేయ్ నియ్యబ్బా..’ అంటూ హీరో గోపీచంద్ ఫై ఎ.ఎస్.రవికుమార్ సంచలన వ్యాఖ్యలు