Account Balance Zero : అకౌంటులో సున్నా బ్యాలెన్స్.. లోక్‌సభ బరిలో నిరుపేద మహిళ
Account Balance Zero : ఆమె బ్యాంకు అకౌంటులో జీరో బ్యాలెన్సు ఉంది.
- By Pasha Published Date - 03:55 PM, Sat - 27 April 24

Account Balance Zero : ఆమె బ్యాంకు అకౌంటులో జీరో బ్యాలెన్సు ఉంది. అయితేనేం కోటీశ్వరులైన అభ్యర్థులను ఎదుర్కోగలననే ఆత్మవిశ్వాసం నిండుగా ఉంది. అందుకే ఆమె ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈవిధంగా ప్రభంజనం క్రియేట్ చేసిన 33 ఏళ్ల శాంతిబాయి మారావిపై(Account Balance Zero) యావత్ ఛత్తీస్‌గఢ్‌లో చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆమె ఎవరు ? కడు బీదరికంలోనూ ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తున్నారు ? ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
శాంతిబాయి ఆస్తులు ఇవీ..
- కోర్బా లోక్‌సభ స్థానం పరిధిలో 8 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిలో ఒకటైన మార్వాహి అసెంబ్లీ స్థానంలోని గౌరెల పెండ్రా మండలంలోని బెద్రపాని గ్రామ వాస్తవ్యురాలే శాంతిబాయి మారావి.
- ఆమెకు బ్యాంక్ ఆఫ్ బరోడా పెండ్రా బ్రాంచ్‌లో బ్యాంకు అకౌంట్ ఉంది. అయితే అందులో ఒక్క రూపాయి కూడా లేదు.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలో రెండు వేల రూపాయలు ఉన్నాయి.
- చేతిలో కేవలం రూ.20 వేల నగదు ఉంది.
- 10 గ్రాముల బంగారం, 50 గ్రాముల వెండి శాంతి దగ్గర ఉంది.
- శాంతికి ఒక్క సోషల్ మీడియా అకౌంటు కూడా లేదు. సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను ఎలా వాడాలో ఆమెకు అస్సలు తెలియదు.
- కనీసం ఇప్పటిదాకా ఆమె పాన్ కార్డు కోసం అప్లై చేసుకోలేదు.
- శాంతి ఐదోతరగతి పాసయ్యారు.
- వారిది సన్నకారు రైతు కుటుంబం. ఒకటిన్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.
- కూలీ పనులు, వ్యవసాయం చేయగా వచ్చే ఆదాయంతోనే శాంతిబాయి మారావి కుటుంబం నడుస్తోంది.
Also Read :Actor Missing : టీవీ నటుడి కిడ్నాప్.. ఐదు రోజులుగా మిస్సింగ్.. ఏమైంది ?
ఇతర అభ్యర్థుల ఆస్తులివీ..
- కోర్బా లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా జ్యోత్స్నా మహంత్, బీజేపీ నుంచి సరోజ్ పాండే పోటీ చేస్తున్నారు.
- కాంగ్రెస్ అభ్యర్థి జ్యోత్స్నా మహంత్ ఆస్తుల విలువ రూ.9.17 కోట్లు. జ్యోత్స్నా మహంత్ భర్త చరణ్ దాస్ మహంత్‌కు కూడా రూ.8.79 కోట్ల ఆస్తులు ఉన్నాయి.
- బీజేపీ అభ్యర్థి సరోజ్ ఆస్తులు రూ.2.87 కోట్లు.