Actor Missing : టీవీ నటుడి కిడ్నాప్.. ఐదు రోజులుగా మిస్సింగ్.. ఏమైంది ?
Actor Missing : గురుచరణ్ సింగ్.. ప్రముఖ బాలీవుడ్ టీవీ షో ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ లో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.
- By Pasha Published Date - 02:35 PM, Sat - 27 April 24

Actor Missing : గురుచరణ్ సింగ్.. ప్రముఖ బాలీవుడ్ టీవీ షో ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ లో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చిన 50 ఏళ్ల గురుచరణ్ మిస్సయ్యారు. ఆయన ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఏప్రిల్ 22న ఉదయం 8.30 గంటలకు ముంబైకి వెళ్తున్నానని చెప్పి ఢిల్లీలోని ఇంటి నుంచి ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్టుకు గురుచరణ్ బయలుదేరారు. ఆ తర్వాతి నుంచి ఆయన కనిపించకుండా పోయారు. ఆయనకు ఫోన్ కాల్ కూడా కనెక్ట్ కావడం లేదు. దీంతో గురుచరణ్ తండ్రి హర్గిస్ సింగ్ పోలీసులను ఆశ్రయించారు. కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
We’re now on WhatsApp. Click to Join
వాస్తవానికి ఎయిర్ పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి విమానంలో గురుచరణ్(Actor Missing) ముంబైకి వెళ్లాల్సి ఉంది. అయితే గురుచరణ్ విమానం ఎక్కలేదని విచారణలో వెల్లడైంది. ఈ మార్గంలోని సీసీటీవీ రికార్డులను పరిశీలించగా ఏప్రిల్ 22న రాత్రి 9.14 గంటలకు పాలెంలోని ఓ ట్రాఫిక్ మధ్యలో గురుచరణ్ రోడ్డు దాటుతున్న దృశ్యాలు కనిపించాయి. ఈక్రమంలో ఆయనను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. గురుచరణ్ సింగ్ ఫోన్ నంబర్ ఏప్రిల్ 24 వరకు యాక్టివ్‌గానే ఉందని.. ఫోన్ నుంచి పలు ట్రాన్సాక్షన్స్ జరిగాయని అధికారులు తెలిపారు.పాపులర్ టీవీ షో ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’లో రోషన్ సింగ్ సోధీ పాత్రను గురుచరణ్ పోషించారు. అయితే తండ్రి అనారోగ్యం కారణంగా 2020లో ఈ సిరీస్ నుంచి ఆయన వైదొలిగారు.