SBI Annuity Deposit Scheme : ప్రతినెల ఆదాయం వచ్చే ఎస్బీఐ ఈ స్కీం గురించి తెలుసా..?
SBI Annuity Deposit Scheme ప్రభుత్వ రంగ బ్యాంక్ ల్లో అతిపెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇన్వెస్టర్ల కోసం
- By Ramesh Published Date - 08:31 PM, Sun - 1 October 23

SBI Annuity Deposit Scheme ప్రభుత్వ రంగ బ్యాంక్ ల్లో అతిపెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇన్వెస్టర్ల కోసం రక రకాల స్కీమ్స్ తీసుకొస్తుంది. ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ కూడా ఉంది. దీనిలో ఒకసారి ఎంత మొత్తంలో అయినా ఇన్వెస్ట్ చేయడం ద్వారా ప్రతి నెల పెన్షన్ రూపంలో ఆదాయం పొందే అవకాశం ఉంది. తమ దగ్గర ఉన్న డబ్బుని రిస్క్ లేని మార్గంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటారు. వారికి ఈ స్కీమ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
SBI యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ ద్వారా డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వారికి నెక్స్ట్ మంత్ నుంచే వారి చేతికి డబ్బులు వస్తాయి. ప్రిన్సిపల్ అమౌంట్ వడ్డీ రేటు ఇందులో కలిసి ఉంటాయి. ఇన్వెస్ట్ చేసిన మొత్తం లో కొంత భాగం ఇంకా కొంత వడ్డీ కలిసి ప్రతి నెలా వస్తుందన్నమాట. ఈ స్కీమ్ లో 3, 5, 7, 10 ఏళ్ల టెన్యూర్లు ఉంటాయి.
ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ (SBI Annuity Deposit Scheme)లో వడ్డీ రేట్లు టర్మ్ డిపాజిట్ వడ్డీ రేట్లకు సమానంగా ఉంటాయి. సినియర్ సిటిజన్లకు ఈ స్కీమ్ ద్వారా అధిక వడ్డీ రేటు లభిస్తుంది. ఈ స్కీమ్‌లో చేరేందుకు భారతీయ పౌరులందరూ అర్హులే. మైనర్ల పేరు మీద కూడా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎన్.ఆర్.ఐ, ఎన్.ఆర్.ఓ కేటగిరీ వాళ్లకు మాత్రం వీలు లేదు. ఈ స్కీమ్ అన్ని SBI బ్యాంక్ బ్రాంచుల్లో అందుబాటులో ఉంటుంది. నెలకు కనీసం 1000 రూ.లు అందేలా యాన్యుటీ డిపాజిట్ ఉంటుంది. అయితే కనీసం మొత్తం 24 వేలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
ఈ స్కీమ్ డిపాజిట్ మొత్తంపై ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదు.7 నుంచి 45 రోజుల నుంచి 5, 10 ఏళ్ల కాల పరిమితిల్లో డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రతి నెలా ఇచ్చే యాన్యుటీ మొత్తాన్ని పాలసీ దారుని బ్యాంక్ సేవింగ్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్ లో జమ చేస్తారు. దేశం మొత్తం మీద ఏ SBI బ్రాంచికి అయినా ఈ పథకాన్ని బదిలీ చేసుకునే అవకాశం ఉంది. ప్రతి నెల యాన్యుటీలో పాటు ప్రిన్సిపుల్ అమౌంట్ లో 75 శాతం వరకు లోన్ పొందే అవకాశం ఉంది.
Also Read : TSRTC : దసరా స్పెషల్ బస్సుల్లో ఒక్క రూపాయి కూడా అదనపు ఛార్జ్ లేదు