Morning Romance: మార్నింగ్ సెక్స్ సో బెటర్.. అసలు సీక్రెట్ ఇదే!
రోజంతా ఆలసిపోయిన జంటలు రాత్రిపూట శృంగారానికి దూరంగా ఉండటం సర్వసాధారణం.
- Author : Balu J
Date : 24-03-2023 - 5:13 IST
Published By : Hashtagu Telugu Desk
ఈ తరం జంటలు (Couple) కాలంతో పోటీ పడుతున్నారు. టార్గెట్స్, ఉద్యోగాలు, ఫ్యామిలీ బాధ్యతలతో సతమతమవుతున్నారు. వివిధ పనులతో రోజంతా ఆలసిపోయిన జంటలు రాత్రిపూట శృంగారానికి దూరంగా ఉండటం సర్వసాధారణం. అయితే రాత్రిపూట సెక్స్ (Sex) నిదానంగా రసహీనంగా మారుతుంది. రాత్రి కలయికలో ఎలాంటి ఆస్వాదన కూడా పలు జంటలు కూడా తేల్చి చెప్పాయి. దీంతో చాలామంది రాత్రిపూట రొమాన్స్ బదులు ఎర్లీ మార్నింగ్ సెక్స్ (Sex) చేయడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.
ఉదయం సమయంలో లైంగిక ప్రేరేపణ గరిష్ట స్థాయికి వచ్చే అవకాశం ఉంది. జంటలు రాత్రి సెక్స్‌కు బదులుగా ఉదయం సెక్స్‌ను ఎంచుకోవడానికి చాలా కారాణాలున్నాయి. చాలా మంది వ్యక్తులు ఉదయం పూట మరింత శక్తితో ఉంటారు. దీంతో ఆనందదాయకమైన లైంగిక అనుభవాలకు దారి తీస్తుంది. మంచి నిద్ర (Good Sleep) అలవాట్లకు ప్రాధాన్యతనిచ్చేవారు మార్నింగ్ టైమ్ సెక్స్ మరింత జోరు చూపుతారని సర్వేలో కూడా తేలింది.
టెస్టోస్టెరాన్ స్థాయిలు పురుషులు, మహిళలు ఇద్దరికీ ఉదయం పూట ఎక్కువగా ఉంటాయి. ఇది లైంగిక కోరికను మరింత పెంచుతుంది. ఇద్దరు భాగస్వాములు ఉద్రేకానికి గురవుతారు. మంచి సెక్స్ (Sex) కోసం ఇద్దరు ఆసక్తి చూపుతారు. ఇక మంచి రాత్రి నిద్ర తర్వాత, చాలా మంది వ్యక్తులు రిఫ్రెష్ అవుతారు. ఈ కారణంగా మానసిక స్థితి బాగుంటుంది. ఇక ఉదయాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఆ సమయంలో భార్యాభర్తలు ఏకాంతంగా గడిపేందుకు మరింత దోహదపడుతుంది. మీ భాగస్వామితో శృంగారంలో పాల్గొనడం ద్వారా రోజును ప్రారంభించినట్లయితే ఆ రోజంతా చాలా సంతోషంగా ఉంటుందట.
Also Read: Samantha Shaakuntalam: ఎన్టీఆర్ స్పూర్తి.. సమంత కోసం 14 కోట్ల బంగారం