PAN Card: ఆధార్ తో మీ పాన్ లింక్ అయ్యిందా..? ఇలా తెలుసుకోవచ్చు
ఆధార్ (Aadhaar Card) తో పాన్ నంబర్ అనుసంధానం చేసుకోవాలని కేంద్రం ఎప్పటి నుంచో కోరుతోంది.
- By Maheswara Rao Nadella Published Date - 12:30 PM, Mon - 6 February 23

ఆధార్ తో పాన్ నంబర్ (PAN Card) అనుసంధానం చేసుకోవాలని కేంద్రం ఎప్పటి నుంచో కోరుతోంది. అయినా ఇప్పటికీ చాలా మంది అనుసంధానించుకోలేదు. ఇప్పటి వరకు 61 కోట్ల పాన్ లు విడుదల చేయగా.. కేవలం 48 కోట్ల మంది అనుసంధానించుకున్నారు. ఆధార్-పాన్ అనుసంధానం పూర్తిగా ఉచితమే కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు రూ.1,000 చెల్లించి మార్చి 31 వరకు లింక్ చేసుకునే అవకాశం ఉంది. ఆధార్-పాన్ అనుసంధానించుకోకపోతే మార్చి 31 తర్వాతి రోజు నుంచి పాన్ (PAN Card) డీయాక్టివేట్ అయిపోతుంది. దీంతో పెట్టుబడులు, ముఖ్య ఆర్థిక లావాదేవీలు చేసుకోవడానికి వీలు పడదు. పన్ను రిటర్నులు కూడా దాఖలు చేయలేరు. మిగిలిన వారు కూడా మార్చి 31లోపు లింక్ చేసుకోవాలని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి కోరుతోంది.
ఆదాయపన్ను శాఖ పోర్టల్ కు వెళ్లి ఆధార్-పాన్ నంబర్ అనుసంధానించుకోవచ్చు. ఒకవేళ మీరు ఇప్పటికే లింక్ చేసుకున్నదీ, లేనిది తనిఖీ చేసుకోవచ్చు. ఆదాయపన్ను శాఖ పోర్టల్ https://www.incometax.gov.in/iec/foportal/ లో ఎడమ చేతి వైపు లింక్ ఆధార్ స్టేటస్, లింక్ ఆధార్ ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిని సెలక్ట్ చేసుకుని ముందుకు వెళ్లాలి. అలాగే, https://www.pan.utiitsl.com/panaadhaarlink/forms/pan.html/panaadhaar పోర్టల్ కు వెళ్లి పాన్ నంబర్, డెట్ ఆఫ్ బర్త్, క్యాపెచా ఇస్తే అనుసంధానం గురించి సమాచారం తెలియజేస్తుంది.
Also Read: Elon Musk: ట్విట్టర్ దివాలా తీయకుండా కాపాడుకున్నా: ఎలాన్ మస్క్

Related News

PAN Aadhar Link: పాన్ ఆధార్ లింకుకు గడువు పెంచిన కేంద్ర ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే?
ఆధార్ కార్డు అనేది ప్రతి దానికి నిత్యం అవసరమైనది.