Indian Flag : జనవరి 26 , ఆగస్ట్ 15 వేడుకల్లో త్రివర్ణ పతాకం ప్రోటోకాల్ ఇలా..!
ఆగస్ట్ 15వ తేదీన ఎగురవేసే త్రివర్ణ పతాకం(Indian Flag),
- By CS Rao Published Date - 12:22 PM, Thu - 26 January 23

స్వాతంత్ర్యం వచ్చిన ఆగస్ట్ 15వ తేదీన ఎగురవేసే త్రివర్ణ పతాకం(Indian Flag), జనవరి 26న జాతీయ జెండా ఆవిష్కరణకు ఉన్న వ్యత్యాసం తెలుసా? ఆ రెండు రోజుల్లో జరిగే వేడుకలకు స్పష్టమైక ప్రోటోకాల్ (protocal)ఉంది. దాన్ని తెలుసుకుని జాతీయ జెండా ఆవిష్కరణ జరగాలి. ఎర్రకోట మీద ప్రధాని హోదాలో జాతీయ పతాకాన్ని ఆగస్ట్ 15వ తేదీ ప్రతి ఏడాది ఎగురవేస్తారు. అదే, జనవరి 26వ తేదీన ప్రతి సంవత్సరం రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. అంతేకాదు, జెండా ఎగురవేసే, ఆవిష్కరించే క్రమంలో ప్రోటోకాల్ భిన్నంగా ఉంటుంది.
ఎగురవేసే త్రివర్ణ పతాకం(Indian Flag)
భారత దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుతూ స్వాతంత్ర్యాన్ని పొందని రోజు ఆగస్టు 15, 1947వ సంవత్సరం. అందుకే, ప్రతి ఏటా ఈ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆ తేదీన దేశవ్యాప్తంగా జెండా(Indian Flag) ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం.
Also Read : CM KCR: రిపబ్లిక్ డే వేడుకలకు కేసీఆర్ డుమ్మా!
స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15న ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఆరోజున జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిన సంకేతంగా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. తొలి ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ భారత దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్య్రం వచ్చిందని తెలియజేయడానికి త్రివర్ణ పతాకాన్ని ఇలా పైకి లాగుతారు. కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా త్రివర్ణ పతకాన్ని పైకి లాగడం(Protocal) నిలుస్తోంది.
గణతంత్ర దినోత్సవం జనవరి 26 రోజున రాష్ట్రపతి జెండాను..
ఇక గణతంత్ర దినోత్సవం జనవరి 26 రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని స్తంభం పైభాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు. ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేస్తారు. ఇలా ఈ రెండు తేదీలలో జెండాను రెపరెపలాడిస్తారు. జనవరి 26 నాడు జెండాను కర్ర లేదా పోల్ కి పైన కట్టి ఉంచుతాము. ఆగస్ట్ 15 లాగా జెండాను కింది నుండి పైకి లాగడం ఉండదు అనేది గుర్తించాలి.
Also Read : Republic Day 2023: ఏపీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
దేశ పౌరుల ప్రతినిధి, భారత పార్లమెంటుకు ప్రజల చేత ప్రజల కోరకు ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన దేశ ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవం రోజున జండా ఎగురవేయడం ఆనవాయితీ. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడం ప్రొటోకాల్ గా ఉంది. స్వాతంత్ర్యం ప్రకటించిన నాటికి భారత దేశానికి రాజ్యాంగం అమలులోకి రాలేదు. అప్పటికి రాజ్యాంగ అధిపతిగా రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతిగా రాష్ట్రపతిని ఉంచారు. అందుకే, రిపబ్లిక్ డే నాడు రాష్ట్రపతి జాతీయ జెండాను మహోన్నతంగా ఆవిష్కరిస్తారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగురవేస్తారు(Flag Hoisting). గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు(Flag Unfurling) అనే విషయాన్ని అందరూ గుర్తించుకోవాలి.
Also Read : PM Modi Greets: ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. ఐక్యంగా ముందుకు సాగాలని ట్వీట్..!
ఇంకొక వ్యత్యాసం ఏమిటంటే స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వేడుకలు రెండు వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతాయి. స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్ట్ 15 నాడు జెండా ఎగురవేసే కార్యక్రమం ఎర్రకోటలో జరుగుతుంది. గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు రాజ్‌పథ్‌లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ప్రధాని, కేంద్ర మంత్రులు హాజరవుతారు. అదే, స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు బహిరంగ ప్రదేశాల్లో జెండాలను ఎగురవేస్తారు. పోలీస్ పేరెడ్ ను నిర్వహిస్తారు. గవర్నర్లు ఆయా రాష్ట్రాల రాజ్ భవన్ కేంద్రంగా రిపబ్లిక్ డేను జరుపుకుంటారు. ఆయా రాష్ట్రాల సీఎంలు, మంత్రులు రాజ్ భవన్ వేడుకలకు హాజరవుతారు. ప్రస్తుతం బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్, సీఎం లకు మధ్య గ్యాప్ నెలకొంది. అందుకే, స్వాతంత్ర్య దినోత్సవాలకు గవర్నర్లు, గణతంత్ర్య దినోత్సవాలకు సీఎంలు దూరంగా ఉంటున్నారు. వేర్వేరుగా జరుపుకోవడం కనిపిస్తోంది. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పరిణామం చోటుచేసుకోవడం ప్రోటోకాల్ కు విరుద్ధం.
Related News

India Name Change : ఇండియా పేరు మార్పుపై ఐరాస ఏమంటుందంటే..
కేంద్రం (Central government) మరో కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఇప్పటివరకు మనదేశాన్ని ఇండియా (India) గా పిలుస్తూవచ్చాం..కానీ ఇప్పుడు కేంద్ర సర్కార్ ఇండియా ను కాస్త భారత్ (Bharat) గా మార్చేందుకు డిసైడ్ అయ్యింది. ఇప్పటికే దీనికి సంబదించిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఇండియా పేరు మార్పు ఫై ఐరాస స్పందించింది. ‘ఇండియా (India)’ పేరు ఇంగ్లిష్లోనూ‘భారత్ (Bharat)’గా మారనుందా? అన్న మీ