Year Ender 2023: 2023లో బ్యాచ్లర్ లైఫ్ కి గుడ్ బై చెప్పిన టీమిండియా ఆటగాళ్లు
ప్రతి ఏడాది చివర్లో సంవత్సరంలో జరిగిన చిత్ర, విశేషాలు నెమరేసుకుంటూ ఉంటాము. ఈ ఏడాది టీమిండియా ఆటగాళ్లు బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి వివాహబంధంలోకి అడుగుపెట్టారు
- By Praveen Aluthuru Published Date - 09:17 PM, Wed - 27 December 23

Year Ender 2023: మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. ప్రతి ఏడాది చివర్లో సంవత్సరంలో జరిగిన చిత్ర, విశేషాలు నెమరేసుకుంటూ ఉంటాము. ఈ ఏడాది టీమిండియా ఆటగాళ్లు బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి వివాహబంధంలోకి అడుగుపెట్టారు. మరి ఈ సంవత్సరం పెళ్లి చేసుకున్న స్టార్ ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం.
2023 జనవరి 23న టీమిండియా స్టార్ వికెట్ కీపర్ కం బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ బాలీవుడ్ నటి అథియా శెట్టిని వివాహం చేసుకున్నాడు. జనవరి 27న స్టార్ ఆల్ రౌండర్ అక్షర పటేల్ తన స్నేహితురాలు మేహా పటేల్ ని పెళ్లి చేసుకుని దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టాడు. ఇదే ఏడాది నవంబర్ 24న ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ తన స్నేహితురాలు స్వాతి ఆస్థానాలను వివాహం చేసుకుని బ్యాచ్లర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేశాడు. నవంబర్ 28న భారత ఫేసర్ ముఖేష్ కుమార్ ముఖేష్ దివ్యసింగ్ ల వివాహం జరిగింది. జూన్ 8వ తేదీన భారత ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణ, రచనల వివాహం జరిగింది. జూన్ 3న బ్యాట్స్ మెన్ రుతురాజ్ గైక్వాడ్, ఉత్కర్ష పవార్ లు పెళ్లి చేసుకున్నారు. ఇక ఫిబ్రవరి 27న భారత ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్, మిథాలి పారుల్కర్ లు వివాహబంధంతో ఒకటయ్యారు.
Also Read: Thandel : సముద్రం మధ్యలో ‘తండేల్’.. త్వరలో ఎగ్జైటింగ్ అప్‌డేట్స్