India Post : ప్రభుత్వ ఉద్యోగం కోసం కలలు కంటున్న యువతకు గుడ్ న్యూస్
- By Latha Suma Published Date - 04:49 PM, Tue - 23 April 24

India Post: ఇండియా పోస్టు డ్రైవర్ పోస్టుల(Driver Posts) భర్తీ కోసం నోటీఫికేషన్(Notification) విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌తో మొత్తం 27 స్టాఫ్ కార్ డ్రైవర్ ఖాళీలను భర్తీ చేయనునాన్నరు. ఇందుకోసం దరఖాస్తు ప్రక్రియ కుడా ప్రారభంమైంది. ఆఫ్‌లైన్ మోడ్‌లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ ఖాళీలన్నీ కర్ణాటక ప్రాంతానికి చెందినవి. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. అప్లయ్ చేసుకోడానికి చివరి తేదీ మే 14, 2024.
We’re now on WhatsApp. Click to Join.
పోస్టుల వివరాలు ఇవే..
ఇండియా పోస్ట్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 2024 ద్వారా మొత్తం 27 స్టాఫ్ కార్ డ్రైవర్ ఖాళీలు భర్తీ చేయబడతాయి. ఏ ఏరియాలో ఎన్ని పోస్టులు రిక్రూట్ అవుతాయో తెలుసుకోండి
చిక్కోడి-1
కలబురగి – 1
హావేరి-1
కార్వార్ – 1
BG ప్రధాన కార్యాలయ ప్రాంతం
MMS, బెంగళూరు – 15
మాండ్య – 1
MMS, మైసూర్- 3
పుత్తూరు-1
శివమొగ్గ-1
ఉడిపి – 1
కోలార్-1
విద్యార్హత, వయోపరిమితి
అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, దరఖాస్తుదారుడి వయస్సు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇందులో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయో సడలింపు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు 40 సంవత్సరాల వయస్సు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు). మాజీ సైనికులకు వయోపరిమితిలో 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది. SC లేదా ST వర్గానికి చెందినవారైతే 8 సంవత్సరాల సడలింపు,OBC వారికి 6 సంవత్సరాల సడలింపు లభిస్తుంది.
ఎంత జీతం..
ఇండియా పోస్ట్‌లో డ్రైవర్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెలా రూ.19,900 నుండి రూ.63,200 వరకు జీతం ఇవ్వబడుతుంది. ఈ జీతం 7వ పే కమిషన్ యొక్క పే లెవెల్ 2 ప్రకారం ఇవ్వబడుతుంది. దీంతో పాటు ఎంపికైన అభ్యర్థులకు ఇతర సౌకర్యాలు కూడా కల్పించనున్నారు.
ఎంపిక ప్రక్రియ
దరఖాస్తుదారు థియరీ టెస్ట్/డ్రైవింగ్ టెస్ట్, మోటార్ మెకానిజం టెస్ట్‌కు హాజరు కావాలి. డ్రైవింగ్ పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులకు మాత్రమే పోస్టింగ్ ఇవ్వబడుతుంది . ఎంపికైన అభ్యర్థికి 2 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ నిర్ణయించబడింది.
దరఖాస్తు ఎలా చేయాలి..
అభ్యర్థులు అవసరమైన అన్ని పత్రాలతో పాటు దరఖాస్తు ఫారమ్‌ను నింపి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఈ చిరునామాకు పంపాలి – “మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, బెంగళూరు – 560001”. ఇతర సమాచారం కోసం, మీరు ఈ లింక్ క్లిక్ చేసి అధికారిక నోటిఫికేషన్‌ను చెక్ చేయవచ్చు.