HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Kalyan Assets Details

Pawan Kalyan Assets : పవన్ కళ్యాణ్ ఆస్తులు.. అప్పుల పూర్తి వివరాలు

పవన్ కళ్యాణ్ ఐదేళ్ల సంపాద‌న రూ.114.76 కోట్లుగా పేర్కొన్నారు. ప్ర‌భుత్వానికి చెల్లించిన ప‌న్నులు రూ.73.92 కోట్లు. అలాగే అప్పులు రూ. 64. 26 కోట్లు ఉన్న‌ట్లు పేర్కొన్నారు.

  • Author : Sudheer Date : 23-04-2024 - 4:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawanass
Pawanass

చిత్రసీమలో అగ్ర హీరో స్థానంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద వందల కోట్లు వసూళ్లు చేసే సత్తాగల నటుడు. ఆయన ఒక్క సినిమా చేస్తే దాదాపు రూ. 40 – 50 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తారు. ఏడాదికి మూడు సినిమాలు చేసిన రూ.150 కోట్లు ఈజీ గా వెనకేసుకోవచ్చు..ఇక యాడ్స్ చేస్తే అంతకన్నా రెట్టింపు డబ్బులు వస్తాయి.

ఏసీ గదుల్లో అందరి ప్రశంసల మధ్య , ఫ్యామిలీతో హ్యాపీగా బ్రతికేయొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రజల శ్రేయస్సే తనకు ముఖ్యం అంటూ రాజకీయాలు చేస్తున్నారు. ఏడాదికి మూడు సినిమాలు చేసే టైం ను రాజకీయాలకు కేటాయిస్తూ..గత పదేళ్లుగా సినిమాల ద్వారా వచ్చిన డబ్బునంతా పార్టీ కార్యక్రమాలకు , కష్టాల్లో ఉన్న ప్రజలకే అందజేస్తు ఈరోజు అప్పులపాలయ్యారు. ఏ రాజకీయ నేతైనా రాజకీయాల్లో డబ్బు వెనకేసుకుంటాడు..కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అప్పు చేసాడు. ఇదే విషయాన్నీ ఈరోజు ఎన్నికల అధికారికి తెలియచేసిన అఫిడ‌విట్‌లో పేర్కొన్నారు.

గత ఎన్నికల్లో రెండో చోట్ల ఘోర పరాజయం చవిచూసిన పవన్ కళ్యాణ్..ఈసారి పిఠాపురం నుండి బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో ఈరోజు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పిఠాపురం (Pithapuram ) ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ (Nomination) వేశారు. ముందుగా చేబ్రోలులోని నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తన కుటుంబ సభ్యులు, సన్నిహుతుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తరువాత అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్ లో రిటర్నింగ్ అధికారి(ఆర్వో) కార్యాలయానికి బయలుదేరారు. పవన్ కళ్యాణ్ వెంట వేలాది మంది అభిమానులు , పార్టీ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నారు. జై జైనసేన, జైజై పవన్ కల్యాణ్ అంటూ భారీగా నినాదాలు చేస్తూ వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ ర్యాలీకి సంబదించిన వీడియోస్ సోషల్ మీడియా లో ట్రెండ్ సెట్ చేస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ర్యాలీగా వెళ్లిన పవన్ కళ్యాణ్ రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ అందజేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వెంట నాగబాబు, ఎస్వీఎస్ఎన్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో ఆస్తుల వివ‌రాలు వెల్ల‌డించారు. పవన్ కళ్యాణ్ ఐదేళ్ల సంపాద‌న రూ.114.76 కోట్లుగా పేర్కొన్నారు. ప్ర‌భుత్వానికి చెల్లించిన ప‌న్నులు రూ.73.92 కోట్లు. అలాగే అప్పులు రూ. 64. 26 కోట్లు ఉన్న‌ట్లు పేర్కొన్నారు. ఇక ఆయ‌న అంద‌జేసిన విరాళాలు రూ. 20 కోట్లుగా పేర్కొన్నారు.

పవన్ ఎక్కడి నుండి అప్పు తీసుకున్నారంటే…

పవన్ కళ్యాణ్ కు మొత్తంగా అప్పులు రూ.64,26,84,453 (64 కోట్ల 26 లక్షల 84 వేల 4 వందల 53 రూపాయలు) ఉన్నాయి. ఇందులో వివిధ బ్యాంకుల నుంచి రూ.17,56,84,453 (17 కోట్ల 56 లక్షల 84 వేల 4 వందల యాభై మూడు రూపాయలు) అప్పుగా తీసుకున్నారు. వ్యక్తుల నుంచి పవన్ కళ్యాణ్ తీసుకున్న అప్పులు రూ.46,70,000 (46 లక్షల 70 వేల రూపాయలు) ఉన్నాయి.

అలాగే జనసేన పార్టీకి వచ్చిన విరాళాలు ఇలా ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ వివిధ సంస్థలకు, జనసేన పార్టీ చేపట్టే సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల నిమిత్తం విరాళాలు అందించారు. ఇందులో జనసేనకు రూ.17,15,00,000 ఉన్నాయి. పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా, క్రియాశీలక కార్యకర్తలకి ప్రమాద బీమా లాంటి కార్యక్రమాలకు ఉపయోగపడేలా వేర్వేరు సందర్భాలలో విరాళాలు ఇచ్చారు. వివిధ సంస్థలకు రూ.3,32,11,717 (రూ.3 కోట్ల 32 లక్షలు) విరాళాలు అందచేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

– కేంద్రీయ సైనిక్ బోర్డు – రూ.1 కోటి
– పి.ఎం. సిటిజెన్ ఆసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఫండ్ – రూ.1 కోటి
– ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి – రూ.50 లక్షలు
– తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి – రూ.50 లక్షలు
– శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ – రూ.30,11,717
– పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్ లెన్స్ – రూ.2 లక్షలు

అలాగే పవన్ కళ్యాణ్ అప్పుల వివరాలు చూస్తే..

పవన్ కళ్యాణ్ 46,70,00,000 రూపాయల మేర అప్పులు ఉన్నట్లుగా చూపించారు. 15 మంది దగ్గర ఈ మొత్తాన్ని లోన్లు/డ్యూస్‌గా తీసుకున్నట్లు పేర్కొన్నారు. అవన్నీ కూడా పర్సనల్ లోన్లుగా పొందుపరిచారు. ఈ 15 మందిలో పవన్ కల్యాణ్ వదిన, మెగాస్టార్ చిరంజీవి భార్య కొణిదెల సురేఖ కూడా ఉన్నారు. ఈమె దగ్గరి నుండి 2,00,00,000 రూపాయల మేర పర్సనల్ లోన్ తీసుకున్నట్లు పవన్ కల్యాణ్ ఈ అఫిడవిట్ ద్వారా వెల్లడించారు. పవన్‌కు పర్సనల్ లోన్ ఇచ్చిన వారి జాబితాలో- విజయలక్ష్మి వీఆర్- రూ.8,00,00,000, హారిక అండ్ హాసిని క్రియేషన్స్- రూ.6,35,00,000, లీడ్ ఐటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్- రూ. 6,00,00,000, ఎంవీఆర్ఎస్ ప్రసాద్- రూ. 3,50,00,000, యెర్నేని నవీన్- రూ. 5,50,00,000 లోన్లు పవన్ పేరు మీద ఉన్నాయి. ఎం ప్రవీణ్ కుమార్- రూ.3,00,00,000, మైత్రీ మూవీ మేకర్స్- రూ.3,00,00,000, శ్రీ యశ్వంత్ ఫైనాన్షియర్స్- రూ.3,00,00,000, రాహుల్ కుందవరం- రూ.2,80,00,000, ఎంవీఆర్ఎస్ ప్రసాద్ (హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీ)- రూ.2,00,00,000, కొణిదెల సురేఖ- రూ.2,00,00,000, కోటింరెడ్డి సాహిత్యరెడ్డి- రూ. 50,00,000, లింగారెడ్డి లలిత- రూ. 50,00,000, ఏ దయాకర్- రూ.45,00,000, డీవీవీ ఎంటర్‌ప్రైజెస్- రూ.10,00,000ల మేర పర్సనల్ లోన్స్ తీసుకున్నట్లు తెలియజేసారు.

పిఠాపురం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యక్రమంలో పాల్గొన్న నాగబాబు, పిఠాపురం టీడీపీ ఇంఛార్జి వర్మ. #Pithapuram #pawankalyan #AndhraPradeshElections2024 #JanasenaParty #Nomination #HashtagU pic.twitter.com/AHOFQ2wDow

— Hashtag U (@HashtaguIn) April 23, 2024

Read Also : Hanuman: భాగ్యనగరంలో మార్మోగిన హనుమాన్ నామస్మరణ, పాల్గొన్ననేతలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • AP Elections 2024
  • Janasena
  • Pawan Kalyan
  • Pawan Kalyan Assets
  • Pawan Kalyan Nomination
  • pithapuram

Related News

Unified Family Survey

Janganana 2027: ఏపీలో మే 1 నుంచి హౌస్ లిస్టింగ్

రెండవ దశలో అసలైన జనాభా లెక్కింపు ప్రక్రియ 2027 ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుంది. ఇందులో వ్యక్తుల వయస్సు, విద్య, ఉపాధి, మతం, భాష వంటి పూర్తి స్థాయి సామాజిక-ఆర్థిక వివరాలను సేకరిస్తారు. గత పదేళ్లకు పైగా కాలంలో రాష్ట్ర జనాభాలో వచ్చిన మార్పులు

  • Ustad Bhagat Singh Ccensor

    Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీంకు సెన్సార్ షాక్

  • Liquor Price Down

    Liquor Price : మందుబాబులకు డబుల్ కిక్..భారీగా తగ్గనున్న మద్యం ధరలు

  • Sarpanch Election Updates I

    Sarpanch Elections Updates in AP : ఏపీలో సర్పంచ్ ఎన్నికలు

  • Ap Ration Card Service Char

    Ration Card Service Charges : ఏపీలో రేషన్ కార్డు సర్వీస్ ఛార్జీలు పెంపు!

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd