HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >India Nri Sanjith Konda Now Owns Million Dollar Firm In Australia

Sensation Sanjith: చదువు మానేసి..చాయ్‌తో రూ.5 కోట్లు.. కొండా సంచిత్ సక్సెస్ స్టోరీ!

మెల్‌బోర్న్‌ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన ఆ యువకుడు ఆస్ట్రేలియాలో ఓ దిగ్గజ యూనివర్సిటీలో బీబీఏ (బ్యాచిలర్స్‌ ఇన్‌ బిజినెస్‌

  • Author : Balu J Date : 10-11-2022 - 11:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Konda
Konda

మెల్‌బోర్న్‌ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన ఆ యువకుడు ఆస్ట్రేలియాలో ఓ దిగ్గజ యూనివర్సిటీలో బీబీఏ (బ్యాచిలర్స్‌ ఇన్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌) చదివి మంచి ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో విమానం ఎక్కాడు. కానీ అక్కడకు వెళ్లాక తనకు ఉద్యోగం సరికాదనే నిర్ణయానికి వచ్చి, చాయ్‌తో అద్భుతాన్నే చేశాడు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ నగరం కాఫీకి ప్రసిద్ధి. ఇపుడు అక్కడ మన నెల్లూరు కుర్రాడి చాయ్‌ అంటే ఆసక్తి చూపే వాళ్లు పెరుగుతున్నారు. ఆ నగరంలో ఎపుడూ రద్దీగా ఉండే సీబీడీ (సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌) ప్రాంతంలోని ఎలిజబెత్‌ స్ట్రీట్‌లో చూస్తే భారతీయులు, ఆస్ట్రేలియా వాసులు కలిసి అక్కడి ‘డ్రాప్‌అవుట్‌ చాయ్‌వాలా’ షాప్‌లో టీ చప్పరిస్తూ సమోసా తింటూ కనిపిస్తారు. ‘డ్రాప్‌అవుట్‌ చాయ్‌వాలా’ పేరు కనిపించగానే చాలా మంది భారతీయులు తప్పనిసరిగా ఆగుతారని ఈ అంకుర సంస్థను స్థాపించిన కొండా సంజిత్‌ (22) చెబుతున్నారు. తమ టీ ఆస్వాదించి, ముందుకు సాగుతారని ఎంతో సంతృప్తితో తెలిపారు. అందుకే ఏడాదిలోనే రూ.5 కోట్ల టర్నోవరు సాధిస్తున్నానని సంజిత్‌ తెలిపారు.

‘ఇక్కడి లా ట్రోబ్‌ యూనివర్సిటీలో బీబీఏ చదవడానికి వచ్చాను. అయితే కోర్సు పూర్తి చేయడంలో విఫలమై, కాలేజీ డ్రాప్‌అవుట్‌గా మారాను. అపుడే సొంత అంకురాన్ని పెట్టాలని అనుకున్నా. చిన్నప్పటి నుంచీ నాకు టీ అంటే ఇష్టం. అందుకే ‘డ్రాప్‌అవుట్‌ చాయ్‌వాలా’కు అంకురార్పణ చేశాను. టీ కొట్టు పెడతానన్నపుడు నా తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి లోనైనా, సొంత వ్యాపారం పెడుతున్నానని వారికి నచ్చజెప్పాను. అస్రార్‌ అనే ఒక ప్రవాసుడు నా ప్రాజెక్టుపై నమ్మకం ఉంచి ఏంజెల్‌ ఇన్వెస్టర్‌గా మారడానికి ఒప్పుకున్నారు. అలా దీన్ని మొదలుపెట్టాను. వచ్చే నెలతో ఏడాది పూర్తవుతుంది. మా ఆదాయం పన్నులు పోగా 1 మిలియన్‌ ఆస్ట్రేలియా డాలర్ల (దాదాపు రూ.5.2 కోట్లు)కు చేరనుంది. లాభం 20% దాకా ఉండొచ్చు. ఇక్కడి మన భారతీయులకు ‘బాంబే కటింగ్‌’ టీ అంటే చాలా ఇష్టం. అలాగే ఆస్ట్రేలియన్లు మన ‘మసాలా చాయ్‌’, పకోడాలంటే ఆసక్తి చూపుతున్నారు. మేం మెల్‌బోర్న్‌లో రెండో అవుట్‌లెట్‌ తెరవనున్నాం.

ఆలోచన బాగుంటే వ్యాపారం సులువే: మీ ఆలోచనలు బాగుండాలే కానీ.. ఆస్ట్రేలియా అనేది సులువుగా వ్యాపారం చేసుకోవడానికి వీలున్న చోటు. కొత్త వినియోగదార్లను ఆకట్టుకోవడానికి ఫ్యూజన్‌ గ్రీన్‌ టీ, చాయ్‌పిచ్చునో (కాపిచ్చునోకు టీ వర్షన్‌)ను మరింత మెరుగుపరచాల్సి ఉంది. ఇపుడు నా తల్లిదండ్రులు నా విజయంపై గర్వంగా ఉన్నారు. ఇపుడు సోషల్‌ వర్క్‌లో నా డిగ్రీని పూర్తి చేస్తా అన్నారు కొండా సంజిత్‌.’


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • australia
  • india
  • millionaire
  • Sanjith Konda

Related News

T20 World Cup

పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

ఐసీసీ తీసుకోబోయే నిర్ణయాలు కేవలం పీఎస్ఎల్ మీదనే కాకుండా మొత్తం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మీదే భారం కానున్నాయి. బ్రాడ్‌కాస్టర్ జియోస్టార్‌కు పీసీబీ 315 కోట్ల రూపాయలను జరిమానాగా చెల్లించాల్సి రావచ్చు.

  • T20 World Cup

    టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

  • Elon Musk

    జీడీపీలో భారత్ వరల్డ్ నెంబర్ 2.. ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్..!

  • Celebrities And Their Plane

    పలు విమాన ప్రమాదాల్లో చనిపోయిన ప్రముఖులు వీరే !!

  • India- EU Free Trade Deal

    గుడ్ న్యూస్‌.. చౌకగా దొరకనున్న బీర్, మద్యం!

Latest News

  • క్రికెట్ ప్ర‌పంచంలో విషాదం.. మాజీ క్రికెట‌ర్ మృతి!

  • మ‌రోసారి ధ‌నుష్‌తో జ‌త క‌ట్ట‌నున్న సాయి ప‌ల్ల‌వి!

  • అతిగా మ‌సాలా ఫుడ్ తింటున్నారా?

  • ప్ర‌ధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్‌!

  • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

Trending News

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

    • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd