HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >Election Effect Postponement Of All Those Exams Along With Group 2 And Dsc

Election Effect : గ్రూప్-2, డీఎస్సీ ఎగ్జామ్స్ వాయిదా పడతాయా ?

Election Effect : తెలంగాణలో గవర్నమెంట్ జాబ్ రిక్రూట్మెంట్స్ పై ఎన్నికల ఎఫెక్ట్ పడింది.

  • By Pasha Published Date - 10:16 AM, Tue - 10 October 23
  • daily-hunt
TGPSC NEW UPDATE

Election Effect : తెలంగాణలో గవర్నమెంట్ జాబ్ రిక్రూట్మెంట్స్ పై ఎన్నికల ఎఫెక్ట్ పడింది. సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో రాష్ట్రంలో జరిగే పలు పరీక్షలు వాయిదే పడే అవకాశాలు పెరిగాయి. నవంబరులో జరగాల్సిన గ్రూప్ 2 ఎగ్జామ్ తో పాటు డీఎస్సీ పరీక్ష కూడా వాయిదా పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే డీఎస్సీ మొత్తం వాయిదా వేయాలా ? ఎస్జీటీ పరీక్ష మాత్రమే వాయిదా వేయాలా ? అనే దానిపై టీఎస్పీఎస్సీ, విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ పరీక్షల రీషెడ్యూల్ పై త్వరలోనే అధికారిక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని వినవస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

గ్రూప్ 2 పరీక్ష ఏర్పాట్ల కోసం 25వేలపైగానే పోలీసులతో పాటు రెవెన్యూ సిబ్బంది అవసరం. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నవంబర్ 3 నుంచి అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలు కావాల్సి ఉంది. దీంతో పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం ఎన్నికల ప్రక్రియలోనే బిజీగా ఉండనున్నారు. దీంతో సిబ్బంది కొరత, పరీక్ష ఏర్పాట్లలో అవాంతరాల కారణంగా నవంబర్ లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాల్సి వస్తుందని భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఓ వైపు టీఎస్పీఎస్సీ అధికారులు, మరోవైపు గ్రూప్ 2 పరీక్షకు అప్లై చేసిన 5లక్షల పైగానే అభ్యర్థులు అయోమయంలో ఉండిపోయారు.

Also read : Dengue Symptoms: టీమిండియా క్రికెటర్ ను కూడా వదలని డెంగ్యూ.. జ్వరాన్ని గుర్తించే లక్షణాలు, పరీక్షలు ఇవే..!

ఇక ఎన్నికలు ముగిసిన తర్వాతే ఈ పరీక్ష జరుగుతుందనే ప్రచారం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల ప్రభావం డీఎస్సీ పై కూడా పడింది. రాష్ట్రంలో 5వేలకుపైగా టీచర్ పోస్టుల భర్తీకి ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల షెడ్యూల్ కారణంగా ఈ పరీక్షల తేదీలు మారే అవకాశం ఉంది. నవంబర్ 30న పోలింగ్ నేపథ్యంలో ఆ తేదీకి 4రోజులు ముందు, 4 రోజుల  తర్వాత ఎలాంటి పరీక్షలు నిర్వహించే ఛాన్స్ ఉండదని అధికారులు అంటున్నారు. ఈ లెక్కన అక్టోబరు 25 నుంచి 30 వరకు జరిగే ఎస్​జీటీ పరీక్షల నిర్వహణ కష్టమేనని తెలుస్తోంది. దీంతోపాటు డిసెంబర్ 1, 2 తేదీల్లో జరిగే డీఎస్సీ మైనర్ ఎగ్జామ్స్ కూడా వాయిదా (Election Effect) పడనున్నాయి. అయితే వీటన్నింటిపైనా త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశముంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • DSC
  • Election Effect
  • Group 2
  • jobs
  • Postponement of all exams
  • Telangana jobs

Related News

    Latest News

    • Rayalaseema : రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగాయి – మోదీ

    • Silver Price : దీపావళి తర్వాత సిల్వర్ రేట్ తగ్గుతుందా?

    • AI Vizag : AIకు ఏపీ తొలి గమ్యస్థానంగా మారనుంది – మోదీ

    • Fake Votes : కేటీఆర్ చెప్పింది అంత అబద్దమే..దొంగ ఓట్లు సృష్టిచిందే బిఆర్ఎస్ పార్టీ

    • Telangana Cabinet Meeting : క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరు

    Trending News

      • Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

      • Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

      • PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్

      • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

      • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd