Look Back 2024 : జనసేనాధినేత పవన్ కళ్యాణ్ కు కలిసొచ్చిన 2024
Look Back 2024 : 2019 ఎన్నికలలో కేవలం ఒక్క సీటును గెలుచుకున్న జనసేన, 2024 ఎన్నికల్లో 21 శాసనసభ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలను గెలుచుకుని వంద శాతం విజయాన్ని నమోదు చేసింది
- By Sudheer Published Date - 01:01 PM, Sat - 28 December 24

మరో మూడు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి (2025) అడుగుపెట్టబోతున్నాం. 2024కు బై బై చెపుతూ..2025 కి గ్రాండ్ గా వెల్ కం చెప్పేందుకు అంత సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో 2024 విషయాలు , సాధించిన విజయాలు , ఎన్నికల విజయాలు ఓటములు ఇలా అన్ని విషయాల గురించి అంత మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఈ ఇయర్ మెగా ఫ్యామిలీ (Mega Family ) కి బాగా కలిసొచ్చింది. ప్రధానంగా జనసేనాధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు ఈ ఇయర్ లక్కీ ఇయర్ అని చెప్పాలి. 2019 ఎన్నికలలో కేవలం ఒక్క సీటును గెలుచుకున్న జనసేన, 2024 ఎన్నికల్లో 21 శాసనసభ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలను గెలుచుకుని వంద శాతం విజయాన్ని నమోదు చేసింది.
రాజకీయాలను సీరియస్‌గా తీసుకున్న పవన్ కళ్యాణ్.. వ్యూహాత్మకమైన ప్రణాళికలతో ముందుకెళ్లి తన రాజకీయ సత్తా ఏంటో నిరూపించారు. గత పదేళ్లుగా ఎలాంటి పదవులు లేకపోయినా ప్రజల కోసం పనిచేస్తూ..ప్రజల కష్టాలను తెలుసుకుంటూ వారికీ అండగా నిలుస్తూ వారిని దగ్గర చేసుకున్నారు. ఇదే సందర్బంగా గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, వారాహి యాత్ర ద్వారా ప్రజలతో మమేకమయ్యారు. ప్రతిపక్ష ఓటు చీల్చడం వల్ల ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయబోమన్న పవన్ మాట ప్రజలలో విశ్వాసం కలిగించింది.
బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పవన్, సీట్ల పంపకాల విషయంలో కీలక నిర్ణయం తీసుకోని, పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలో విజయం సాధించారు. అలాగే సనాతన ధర్మ రక్షణకు జనసేన కట్టుబడి ఉందని పవన్ చేసిన ప్రకటన..ప్రజల్లో బాగా నాటుకుపోయింది. తిరుపతిలో జరిగిన సభలో పవన్ సనాతన ధర్మ పరిరక్షణపై డిక్లరేషన్ ప్రకటించి, ఆ అంశంపై మరింత స్పష్టత ఇచ్చారు. సనాతన ధర్మానికి కట్టుబడి ఉండడమే కాకుండా, ఇతర మతాలను గౌరవించడం ద్వారా పవన్ ధర్మపరమైన నేతగా పేరు తెచ్చుకున్నారు.
ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే తరపున ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్, తెలుగువారు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో మహాయుతి కూటమి అభ్యర్థులను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ ప్రచారం పవన్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకొచ్చింది. ప్రధాని మోదీ ద్వారా ప్రశంసలు అందుకోవడం పవన్ జాతీయ నాయకుడిగా ఎదిగేందుకు దోహదపడింది. సార్వత్రిక ఎన్నికల నుంచి రాష్ట్ర రాజకీయాల్లో అత్యుత్తమ విజయాలను సాధించిన పవన్ కళ్యాణ్, 2024 సంవత్సరం తన రాజకీయ ప్రస్థానానికి కీలకంగా నిలుస్తుందని నిరూపించారు. ప్రజా సేవకుడిగా తన హామీలను నిలబెట్టుకుంటూ, అభివృద్ధి కార్యక్రమాలను చక్కగా అమలు చేస్తూ పవన్ తన మార్క్‌ను నిరూపించారు. 2024ను పవన్ రాజకీయ విజయాల సంవత్సరంగా అభివర్ణించవచ్చు. అలాగే మెగా ఫ్యామిలీ కి సైతం ఈ ఇయర్ ఎంతో కలిసొచ్చింది. ఓవరాల్ గా 2024 మెగా ఇయర్ గా అభిమానులు ఎప్పటికి గుర్తు పెట్టుకుంటారు.
Read Also : New Year Events : నూతన సంవత్సర వేడుకలపై హైదరాబాద్ పోలీసులు అలర్ట్