HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >Anti Sikh Riots 1984 How Did The Sikh Massacre Happened These Are The Details

Anti Sikh Riots : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు.. ఎవరీ సజ్జన్ కుమార్ ? అసలేం జరిగింది ?

ఢిల్లీలో పెద్ద ఎత్తున అల్లర్లు(Anti Sikh Riots 1984), దోపిడీలు, గృహదహనాలు జరిగాయి.

  • By Pasha Published Date - 09:31 AM, Thu - 13 February 25
  • daily-hunt
Anti Sikh Riots 1984 Sikh Massacre Congress Sajjan Kumar

Anti Sikh Riots 1984: ఢిల్లీలో సిక్కులపై 1984 సంవత్సరం నవంబరు 1న జరిగిన పాశవిక దాడుల ఘటన అప్పట్లో కలకలం రేపింది. ఈ కేసులో కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ సజ్జన్‌ కుమార్‌ను ఢిల్లీలోని ఓ కోర్టు  బుధవారం రోజు దోషిగా తేల్చింది. ఆయనకు ఫిబ్రవరి 18న శిక్షను ఖరారు చేస్తామని ప్రకటించింది. ఇంతకీ ఢిల్లీలో సిక్కు వ్యతిరేక అల్లర్లు ఎందుకు జరిగాయి ? ఆ రోజు అసలేం జరిగింది ? ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :First Dalit CM : దేశంలోనే తొలి దళిత సీఎం మన ‘సంజీవయ్య’.. జీవిత విశేషాలు

1984 నవంబరు 1న ఢిల్లీలో ఏం జరిగింది ?

  • మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీని 1984 అక్టోబరు 31న ఆమె ఇద్దరు బాడీగార్డులు దారుణంగా హత్య చేశారు. వాళ్లిద్దరూ సిక్కు వర్గానికి చెందినవారే.  అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలో దాక్కున్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఇందిరాగాంధీ సర్కారు సైనిక ఆపరేషన్‌ను నిర్వహించినందుకు ప్రతీకారంగా ఈ హత్యకు పాల్పడ్డారు.
  • ఇందిరా గాంధీ హత్య జరిగిన మరుసటి రోజున (1984 నవంబర్‌ 1న) ఢిల్లీలోని సరస్వతీ విహార్‌ ప్రాంతంలో ఉన్న సిక్కుల నివాసాలపై అల్లరి మూకలు మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు.
  • ఢిల్లీలో పెద్ద ఎత్తున అల్లర్లు(Anti Sikh Riots 1984), దోపిడీలు, గృహదహనాలు జరిగాయి.
  • సరస్వతి విహార్‌ ప్రాంతంలో జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్ దీప్ సింగ్‌ను ఓ అల్లరిమూక హత్య చేసింది. ఆ అల్లరిమూక గుంపునకు మాజీ కాంగ్రెస్ నేత సజ్జన్‌కుమార్‌ నాయకత్వం వహించాడని తాజాగా ఢిల్లీ కోర్టు తేల్చింది. ఇందుకు తగిన సాక్ష్యాలు కూడా లభించాయని వెల్లడించింది.
  • ఈ కేసులో 2021 డిసెంబర్‌ 16న సజ్జన్‌కుమార్‌పై అభియోగాలు నమోదయ్యాయి. మూడేళ్ల పాటు  విచారణ జరిపిన కోర్టు ఆయన్ను దోషిగా తేల్చింది.

Also Read :GHMC Jumpings : ‘గ్రేటర్’ స్టాండింగ్ కమిటీ పోల్స్.. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ బలం ఎంత ?

  • ఢిల్లీలో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగిన సమయంలో సజ్జన్ కుమార్ ఒక బేకరీని నడుపుకునేవారు. ఆయన ఇందిరా గాంధీ రెండో కుమారుడు సంజయ్ గాంధీకి సన్నిహితంగా ఉండేవారు.
  • సజ్జన్ కుమార్ తొలుత  ఢిల్లీలో కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు.  ఆయన 1980లో ఔటర్ ఢిల్లీ నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
  • 1991‌లోనూ సజ్జన్ కుమార్ ఎంపీగా ఎన్నికయ్యారు.
  • 2004 సార్వత్రిక ఎన్నికల్లో సజ్జన్ కుమార్  అత్యధికంగా 8,55,543 ఓట్లతో మరోసారి ఎంపీ అయ్యారు. అప్పట్లో దేశంలో అత్యధిక మెజారిటీ సాధించిన ఎంపీ ఆయనే.
  • ఔటర్ ఢిల్లీ లోక్‌సభ స్థానాన్ని సజ్జన్ కుమార్ తన రాజకీయ కంచుకోటగా మార్చుకున్నారు.
  • 2005లో అర్బన్ డెవలప్‌మెంట్ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా సజ్జన్ వ్యవహరించారు. లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ ఏరియా స్కీంలో సభ్యుడిగా సేవలు అందించారు.
  • 2018లో సిక్కుల ఊచకోత కేసులో దోషిగా ప్రకటించబడిన తర్వాత, ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామాచేశారు.
  • 1984లో ఢిల్లీ కంటోన్మెంట్‌ ఏరియాలో జరిగిన మరో సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్‌కు 2018లో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ప్రస్తుతం ఆయన తిహార్ జైలులో ఉన్నారు.
  • దీంతో మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ ప్రస్తుతం తిహార్ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anti Sikh Riots
  • Anti Sikh Riots 1984
  • congress
  • Sajjan Kumar
  • Sikh Massacre

Related News

Bihar Election Congress

Bihar Election Results Effect : ఏడుగురు నేతలపై కాంగ్రెస్ వేటు

Bihar Election Results Effect : బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, దీనికి గల కారణాలపై పార్టీలో అంతర్గతంగా సమీక్షలు జరుగుతున్నాయి

  • Siddaramaiah Vs Dk Shivakum

    Siddaramaiah vs DK Shivakumar : సీఎం పదవి పై డీకేకు అధిష్టానం క్లారిటీ!

Latest News

  • Back Pain: వెన్ను నొప్పితో బాధపడుతున్నారా? ఉపశమనం పొందండిలా!

  • WPL 2026: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫుల్ షెడ్యూల్ ఇదే.. మ్యాచ్‌లు ఎప్ప‌ట్నుంచి అంటే?!

  • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

  • Raisins: 30 రోజులు క్రమం తప్పకుండా కిస్‌మిస్‌లు తింటే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా?

  • Peddi: రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌ను నిరాశ‌ప‌రుస్తున్న పెద్ది టీమ్‌.. కార‌ణ‌మిదే?!

Trending News

    • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

    • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd