All You Need to Know : బీ అలర్ట్ అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. మీ జేబులు ఖాళీ అవ్వకుండా చూసుకోండి..!
All You Need to Know నెల మొదలవుతుంది అంటే ఏదో ఒక కొత్త రూల్ మొదలవుతాయని గుర్తు చేసుకుంటాం. ఆర్ధిక సంవత్సరం
- By Ramesh Published Date - 10:48 PM, Sat - 23 September 23

All You Need to Know నెల మొదలవుతుంది అంటే ఏదో ఒక కొత్త రూల్ మొదలవుతాయని గుర్తు చేసుకుంటాం. ఆర్ధిక సంవత్సరం మొదట్లో ప్రభుత్వం ప్రవేశ పెట్టే బడ్జెట్ లో ఏర్పరచిన కొన్ని మార్పుల వల్ల కొన్ని నిర్ధేశించిన తేడీల్లో కొన్ని అమల్లోకి వస్తాయి. ఈ క్రమంలో అక్టోబర్ లో పర్సనల్ ఫైనాన్స్ విభాగంలో కొన్ని కీలక నిబంధనలు మార్పులు వస్తున్నాయి. ఇందులో మన డబ్బు మీద ప్రభావం చూపే అంశాలు కూడా ఉన్నాయి.
అక్టోబర్ నెల ప్రారంభం లోనే చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులు పూర్తి చేయకపోతే అక్టోబర్ 1 నుంచి వారి బ్యాంక్ ఖాతాలు నిలిచిపోతాయి. అంతేకాదు వడ్డీ కూడా రాకపోవడం లాంటివి జరుగుతాయి. ఇంతకీ అక్టోబర్ నుంచి ఏ నింబంధనలు మారుతున్నాయి ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అన్నది చూద్దాం.
2023 అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా జనన, మరణాల నమోదు సవరణ చట్టం అమలులోకి రానుంది. డ్రైవింగ్ లైసెన్స్, ఓటార్ నమోదు, విద్యా సంస్థల్లో ప్రవేశం, ఆధార్ కార్డ్ పొందడం, మ్యారేజ్ సర్టిఫికెట్, ప్రభుత్వ ఉద్యోగ దరఖాస్తు ఇలా వివిధ ప్రయోజనాలకు బర్త్ సర్టిఫికెట్ సింగిల్ డాక్యుమెంట్ ని వినియోగిస్తే సరిపోతుంది.
అంతేకాదు క్రెడిట్ కార్డ్ ను ఉపయోగించి విదేశాల్లో ఖర్చు చేసే మొత్తంపై కొత్త ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ అమల్లోకి వస్తుంది (All You Need to Know). విదేశీ క్రెడిట్ కార్డ్ ఖర్చు 7 లక్షలు దాటితే 20 శాతం టిసీఎస్ వర్తిస్తుంది. అయితే వీటిని వైద్య లేదా విద్య కోసం వాడితే టీసీఎస్ రేటు 5 శాతం మాత్రమే అవుతుంది.
విద్య వైద్య అవసరాల మినహా విదేశీ ప్రత్యటన ప్యాకేజీలు, లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీం కింద పంపిన ఫండ్స్ పై రేట్లు 5 నుంచి 20 శాతానికి కేంద్రం పెంచింది. అర్హత గల ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాదారులు ఈ అకౌట్లకు సెప్టెంబర్ 30 లోపు నామినీ జత చేయాలి. నామినేషన్ వివరాలు అప్డేట్ చేయడంలో ఫెయిల్ అయితే సెబీ మార్గదర్శకాల ప్రకారం వారి ట్రేడింగ్ ఖాతాలు ఫ్రీజ్ చేసే అవకాశం ఉంది.
ఇన్వెస్ట్ మెంట్లు, అసెట్లను కాపాడుకునేందుకు నామినేషన్ ప్రాసెస్ కచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్ కూడా నామినీలను యాడ్ చేయాలి అలా చేయకపోతే డెబిట్ ట్రాన్ సాక్షన్స్ ఫ్రీజ్ అవుతాయి.
Also Read : Lulu Mall : హైదరాబాద్ లో అతి పెద్ద లులు మాల్.. సర్వం సిద్ధం..!