Kerala Soccer Celebrations: సాకర్ సెలబ్రేషన్స్ లో హింసాత్మక ఘటనలు, ఒకరు మృతి, ఎస్ఐకు గాయాలు!
కేరళ (Kerala) లో జరిగిన సాకర్ సంబురాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి.
- Author : Balu J
Date : 19-12-2022 - 1:19 IST
Published By : Hashtagu Telugu Desk
లియోనెల్ మెస్సీ (Messi) కెప్టెన్సీలో అర్జెంటీనా ప్రపంచకప్ గెలిచింది. భారతదేశంతో పాటు ఇతర దేశలు కూడా సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాయి. అయితే మనదేశంలోని కేరళ రాష్ట్రంలో (Kerala)లో హింసాత్మక ఘటనలు చేసుకున్నాయి. అర్జెంటీనా విజయం (Soccer Celebrations) సాధించిన కొద్దిసేపటికే 17 ఏళ్ల అక్షయ్ కొల్లమ్ అనే అభిమాని సంబరాలు చేసుకున్నాడు. లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో జరిగిన విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్నాడు. అయితే ఏమైందో ఏమోకానీ అకస్మాత్తుగా కుప్పకులిపోయాడు. సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు తెలియవచ్చు.
కేరళ (Kerala)లో అర్జెంటీనా విజయానికి అభిమానులు జరుపుకున్నసెలబ్రేషన్స్ (Soccer Celebrations) హింసాత్మకంగా మారాయి. ముగ్గురు వ్యక్తులు కత్తులతో గాయపడ్డారు, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. కేరళ రాజధానిలోని ఓ సముద్రతీర గ్రామంలో ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ ర్యాలీ అడ్డుకోవడం చాలా కష్టమైంది. కొంతమంది ఇన్‌స్పెక్టర్‌పై దాడి చేశారు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఫుట్‌బాల్ ఆటను అమితంగా ఇష్టపడే కేరళ (Kerala)లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
Also Read: BJP Target Congress: ‘కాంగ్రెస్ వార్’ పై బీజేపీ గురి.. అసంతృప్తులకు ఆహ్వానం!