Ram Mandir: రామ మందిరంపై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
సనాతన ధర్మానికి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే అధినేత ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు అయోధ్యలో రామమందిరం నిర్మాణంపై మాట్లాడారు.
- By Praveen Aluthuru Published Date - 03:37 PM, Thu - 18 January 24

Ram Mandir: సనాతన ధర్మానికి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే అధినేత ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు అయోధ్యలో రామమందిరం నిర్మాణంపై మాట్లాడారు. రామమందిరానికి మేము వ్యతిరేకం కాదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి అన్నారు. చెన్నైలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. మసీదును కూల్చివేసి దాని స్థానంలో గుడి కట్టడాన్ని మేం సమర్థించబోమని అన్నారు. వివరాలలోకి వెళితే..
సనాతన ధర్మంపై నిప్పులు చెరిగిన డీఎంకే అధినేత ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు రామమందిరంపై షాకింగ్ స్టేట్మెంట్ తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మసీదును కూల్చివేసి దాని స్థానంలో గుడి కట్టడాన్ని మేము సమర్థించబోమని మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మా నాయకుడు చెప్పినట్లు మతాన్ని, రాజకీయాలను కలపవద్దు. మేము ఏ ఆలయ నిర్మాణానికి వ్యతిరేకం కాదు, కానీ ఆ స్థలంలో ఆలయాన్ని నిర్మించడాన్ని మేము సమర్థించము. అక్కడ ఒక మసీదు కూల్చిశారని అన్నాడు.
ఉదయనిధి తరచుగా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. గతేడాది సనాతన ధర్మాన్ని డెంగ్యూ, కరోనా వైరస్‌తో పోల్చారు. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా, కరోనా లాంటిదని, వీటిని కేవలం వ్యతిరేకించలేమని, నిర్మూలించాలని ఉదయనిధి అన్నారు. అప్పట్లో ఉదయనిధి కామెంట్స్ పై పెద్ద దుమారమే రేగింది. డీఎంకేపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దేశంలోని 80 శాతం మంది హిందువుల జనాభా నాశనమైందని డీఎంకే నేతలు మాట్లాడుతున్నారని బీజేపీ నేత అమిత్ మాలవీయ అన్నారు.
కాగా తాజాగా ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. పాట్నా ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు దీనికి సంబంధించి కాగ్నిజెన్స్ లెటర్ జారీ చేసింది. ఫిబ్రవరి 13న కోర్టుకు హాజరు కావాలని ఉదయనిధిని కోర్టు ఆదేశించింది.
Also Read: Aviation Show: హైదరాబాద్ లో ఏవియేషన్ షో షురూ.. బేగంపేటలో సందడే సందడి