TVK : దూకుడు పెంచిన విజయ్..
TVK : ‘మీట్ ది పీపుల్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ రోడ్‌షోలు తిరుచ్చి నుంచి మొదలయ్యాయి. విజయ్‌కు ఉన్న అపారమైన అభిమాన వర్గం కారణంగా, ఆయన పర్యటనలకు ప్రత్యేకంగా జన సమీకరణ అవసరం లేకుండానే విపరీతమైన హాజరు కనిపిస్తోంది
- By Sudheer Published Date - 08:15 PM, Sun - 14 September 25
 
                        తమిళనాడు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్న సినీ నటుడు విజయ్(Vijay) తాజాగా ప్రజా పర్యటనలను ప్రారంభించారు. ‘మీట్ ది పీపుల్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ రోడ్‌షోలు తిరుచ్చి నుంచి మొదలయ్యాయి. విజయ్‌కు ఉన్న అపారమైన అభిమాన వర్గం కారణంగా, ఆయన పర్యటనలకు ప్రత్యేకంగా జన సమీకరణ అవసరం లేకుండానే విపరీతమైన హాజరు కనిపిస్తోంది. పార్టీ టిక్కెట్ల కోసం ఎదురుచూస్తున్న నేతలు కూడా ఈ టూర్లను మరింత ప్రాచుర్యం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల విజయ్ పర్యటనలు పెద్ద ఎత్తున సక్సెస్ కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Beer Taste: బీర్ టెస్ట్ బోర్ కొడుతుందా..? అయితే ఇలా చెయ్యండి..అస్సలు వదిలిపెట్టారు !!
విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని బలపర్చుకునే ప్రయత్నంలో ముందుగానే ర్యాలీల ద్వారా హైప్ క్రియేట్ చేస్తున్నారు. సినిమాల్లో కూడా మొదటి రోజు ఓపెనింగ్స్ కోసం హైప్ ఎంత ముఖ్యమో, రాజకీయాల్లో కూడా అదే సూత్రం వర్తిస్తుందని ఆయన అర్థం చేసుకున్నారు. డిసెంబర్ నుంచి ఎన్నికల ప్రచార సభలను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. జయలలిత, కరుణానిధి లాంటి మహానాయకులు ఇక లేని నేపథ్యంలో, ప్రస్తుతం తమిళనాడులో బలమైన ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం ఖాళీ ఉంది. స్టాలిన్ తర్వాత ఆ స్థాయిలో ఎదిగిన నాయకుడు కనిపించకపోవడంతో, విజయ్ కూడా ఆ రేసులో చోటు సంపాదించాలని ప్రయత్నిస్తున్నారు.
ఇక సినిమాల పరంగా కూడా విజయ్ రాజకీయ ప్రవేశాన్ని దృష్టిలో ఉంచుకొని తన చివరి సినిమాను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. ఆ చిత్రం విజయం సాధిస్తే, ఆయన రాజకీయ ఆరంభానికి శుభపరిణామంగా నిలుస్తుందని భావిస్తున్నారు. అయితే పొత్తుల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోవడం ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశముందని కొందరు అంటున్నారు. అయినప్పటికీ జయలలిత, ఎంజీఆర్‌ల మాదిరిగా తాను కూడా తమిళనాడు రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తానని విజయ్ ధీమాగా ముందుకు సాగుతున్నారు.
 
                    



