HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >This Is The New Release Date Of Jananayagan

జననాయగన్ కొత్త రిలీజ్ డేట్ ఇదే..!

  • Author : Vamsi Chowdary Korata Date : 23-02-2026 - 12:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jana Nayagan
Jana Nayagan
Jana Nayagan రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు విజయ్ సినిమాలకు స్వస్తి చెప్పిన విషయం తెలిసిందే. నటుడిగా ఆయన ఆఖరి చిత్రం కావడంతో జననాయగన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, సెన్సార్ అభ్యంతరాల కారణంగా ఈ సినిమా విడుదల పదే పదే వాయిదా పడుతోంది. ఈ నెలలో జననాయగన్ థియేటర్లలో సందడి చేస్తుందని భావించిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. తాజాగా దీని రిలీజ్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. న్యాయపరమైన చిక్కులు వీడితే విజయ్ పుట్టినరోజు కానుకగా జూన్ లో జననాయగన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.

రివైజింగ్ కమిటీ రిపోర్టు కోసం వెయిటింగ్..
మొదట సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం, సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో ఆగిపోయింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలనుకున్నా, ప్రస్తుతం సినిమా రివైజింగ్ కమిటీ వద్ద ఉండటంతో ఈ నెలలో కూడా విడుదల సాధ్యం కాదని తేలిపోయింది. దీంతో మేకర్స్ ఇప్పుడు ఒక ‘స్పెషల్ డే’ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. జూన్ 22న విజయ్ పుట్టినరోజు ఉండటంతో జూన్ 18న ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.

వివాదం నేపథ్యం..
హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రాజకీయపరమైన అంశాల వల్ల సెన్సార్ చిక్కుల్లో పడింది. సెన్సార్ బోర్డు అభ్యంతరాలపై నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‌కు వెళ్లాలని కోర్టు సూచించింది. కోర్టులో ఉన్న రిట్ పిటిషన్‌ను నిర్మాతలు ఉపసంహరించుకుని, ప్రస్తుతం సినిమాను రివైజింగ్ కమిటీకి పంపారు. కమిటీ రిపోర్ట్ ఆధారంగానే తదుపరి అడుగులు పడనున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • actor vijay
  • censor issues
  • H Vinoth
  • Jana Nayagan
  • jana nayagan movie update
  • Jananayagan release
  • Movie Delay
  • Political Movie
  • Tamil cinema
  • Tamil movie release date
  • TVK Leader Vijay
  • Vijay birthday

Related News

Rajinikanth's Jailer 2 footage surfaces online Sun Pictures

Rajinikanth: కోలీవుడ్‌లో మరో షాక్.. రజనీ ‘జైలర్ 2’ సీన్స్ లీక్!

Jailer 2 కోలీవుడ్‌లో లీకేజీల కలకలం ఆగడం లేదు. ఇటీవల విజ‌య్‌ ‘జన నాయగన్’ చిత్రం నుంచి కీలక సన్నివేశాలు బయటకు రావడం మరువకముందే, తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ సినిమాకు కూడా లీకుల బెడద తప్పలేదు. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫుటేజీ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడంతో తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది. ఈ అనూహ్య పరిణామంతో అప్ర

  • Rajasekhar About Daughters Marriage

    Rajasekhar: కూతుళ్ల పెళ్లిపై రాజశేఖర్ షాకింగ్ కామెంట్స్

Latest News

  • IPL 2026 : RR ఓటమిని తట్టుకోలేక ఎక్కి ఎక్కి ఏడ్చిన వైభవ్

  • Jr NTR: మామయ్యకు జూనియర్ ఎన్టీఆర్ విషెస్

  • డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

  • CBN Birthday : మరోసారి గొప్ప మనసు చాటుకున్న చంద్రబాబు

  • Khammam : ఖమ్మం జిల్లా మంత్రులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

Trending News

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd