CM Stalin: జాతీయ రాజకీయాల వైపు స్టాలిన్ అడుగులు!
ప్రధానమంత్రి అవ్వాలని మన దేశంలో చాలామంది రాజకీయ నేతలకు ఆశ ఉంది.
- By Hashtag U Published Date - 11:12 AM, Thu - 14 April 22
ప్రధానమంత్రి అవ్వాలని మన దేశంలో చాలామంది రాజకీయ నేతలకు ఆశ ఉంది. ఆ లిస్టులో రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, కేసీఆర్, శరద్ పవార్, నితీశ్ కుమార్.. ఇలా చాలామంది ఆ పదవిని కోరుకుంటున్నారు. కానీ ఆ ఛాన్స్ అందరికీ వచ్చేది కాదు. అయితే అనూహ్యంగా ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పేరు ఆ జాబితాలోకి చేరింది. అసలు.. స్టాలిన్ పేరు ఇంత సడన్ గా తెరపైకి రావడానికి కారణాలేమిటి? సాధారణంగా తమిళనాడు నాయకులు తమ రాష్ట్రాన్ని దాటి ఢిల్లీ వెళ్లి ఏలాలనుకోరు.
గతంలో కరుణానిధిని దీని గురించి అడిగితే తన పరిమితులు తనకు తెలుసున్నారు. జయలలితను కూడా ప్రధానమంత్రి అభ్యర్థిగా అనుకున్నారు. కానీ ఆమె జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపలేదు. 1960ల్లో కామరాజ్ నాడార్ కూడా ప్రధానమంత్రి అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. కాకపోతే ఆయన కింగ్ కాలేదు కాని.. కింగ్ మేకర్ అయ్యారు. యునైటెడ్ ఫ్రంట్ సమయంలో జీకే మూపనార్ పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. తరువాత అది అక్కడే ఆగిపోయింది. ఇలా తమిళనాడు నుంచి చాలా మంది పేర్లు ప్రధానమంత్రి అభ్యర్థులుగా తెరపైకి వచ్చాయి. ఇప్పుడు స్టాలిన్ పేరు చర్చకు రావడం మాత్రం ఆసక్తిగా గమనించాల్సిన అంశం.
తమిళనాడులో ఉన్న రెండు ప్రధాన ద్రవిడయన్ పార్టీలు జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపవు. తమ రాష్ట్ర ప్రయోజనాలు కోసం ఓసారి బీజేపీతో ఉంటే.. మరోసారి కాంగ్రెస్ తో ఉంటాయి. అలాంటిది తొలిసారిగా.. జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే దిశగా స్టాలిన్ అడుగులు పడుతున్నట్టుగా పరిణామాలు మారుతున్నాయి. స్టాలిన్ ఇప్పటికే బీజేపీ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నారు. పైగా రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటూ చెప్పిన కాంగ్రెస్ మిత్రపక్షాల తొలి నాయకుడు. కానీ కాంగ్రెస్ కు ఇప్పుడా ఛాన్స్ లేకపోవడంతో స్టాలినే తెరపైకి వచ్చినట్టు కనిపిస్తోంది. ఆయన ఆత్మకథ పుస్తకం విడుదల సందర్భంగానూ జాతీయ నాయకులు తరలివచ్చారు. దీంతో స్టాలిన్ జాతీయస్థాయిలో చాలా జాగ్రత్తగా పావులు కదుపుతున్నారంటున్నారు విశ్లేషకులు. మరి స్టాలిన్ కు ఆ లక్కు కలిసి వస్తుందో లేదో చూడాలి.
Related News
ISRO : ఇస్రో 3డీ ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ పరీక్ష వియజవంతం
ISRO 3D Printed Rocket Engine: ఇస్రో(ISRO) మరో విజయం సొంతం చేసుకుంది. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ(3D printing technology) తో రూపొందించిన PS4 ఇంజిన్(Engine) యొక్క దీర్ఘ-కాల పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. అత్యాధునిక సంకలిత తయారీ (AM) పద్ధతులను ఉపయోగించి ఉత్పత్తి కోసం తిరిగి రూపొందించబడింది. సాధారణ పరిభాషలో 3D ప్రింటింగ్ అని కూడా పిలుస్తారు. మరియు భారతీయ పరిశ్రమ, అంతరిక్ష సంస్థలో రూపొందించబడింది. కొత్త ఇంజన్, ఇప్�