Tamil Nadu: రాష్ట్రాల పై కేంద్రం పెత్తనం ఏంటి- స్టాలిన్
- By hashtagu Published Date - 05:26 PM, Thu - 6 January 22

తమిళనాడులో నీట్ (నేషనల్ ఎల్జిబిలిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్) ను రద్దు చేస్తూ అసెంబ్లీ లో తీర్మానించిన బిల్లుకు ఆమోదముద్ర వేయకపోవడం పై ముఖ్యమంత్రి స్టాలిన్ అసహనం వ్యక్తం చేశారు. గత సంవత్సరం సెప్టెంబరు లో అసెంబ్లీ లో తీర్మానం చేసి బిల్లును గవర్నర్ కు పంపుతే.. ఇప్పటివరకు అది రాష్ట్రపతికి చేరలేదని ఎద్దెవా చేశారు. బిల్లును చాలా కాలంగా కేంద్రం పెండింగులో ఉంచిన నేపథ్యంలో గురువారం ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్ అల్ పార్టీ మీటింగ్ కు పిలుపునిచ్చారు. జనవరి 9న జరగనున్న ఈ సమావేశం లో బిల్లు పై తదుపరి కార్యాచరణ రూపొందించనున్నారు.
అసెంబ్లీ లో స్టేలిన్ మాట్లాడుతూ.. బిల్లు ఆమోదం కొరకు పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అపాయింట్మెంట్ పలుమార్లు కోరగా హోంశాఖ స్పందించలేదని.. ఇలా ప్రజప్రతినిధులను రాజకీయ కారణంగా కలవకపోవడం అప్రజాస్వామ్య లక్షణాలని అన్నారు. నీట్ వలన పేద విద్యార్థులకు నష్టం జరుగుతుందని.. డబ్బులు వెచ్చించే వారికీ మెడిసిన్ సీట్ సులభంగా వస్తుందని స్టాలిన్ అన్నారు. అంతే కాకుండా ఇది ఫెడరల్ విధానానికి విరుద్ధమని రాష్ట్రాల హక్కులపై కేంద్రం పెత్తనం ఏంటని ప్రశ్నించారు.