Road Accident : చెన్నైలో రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
చెన్నై సమీపంలో రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే ప్రయత్నంలో ఓ టెక్కీ రోడ్డు ప్రమాదానికి గురైంది. వాహనంపై నుంచి
- Author : Prasad
Date : 04-01-2023 - 10:04 IST
Published By : Hashtagu Telugu Desk
చెన్నై సమీపంలో రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే ప్రయత్నంలో ఓ టెక్కీ రోడ్డు ప్రమాదానికి గురైంది. వాహనంపై నుంచి పడిపోవడంతో 22 ఏళ్ల శోభన అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో శోభన మరణించింది. మధురవాయల్ సమీపంలో ఈ ఘటన జరగగా, ఘటనా స్థలం నుంచి పారిపోయిన ట్రక్కు డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. శోభన అనే బాధితురాలు జోహో అనే ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తోంది. నీట్ కోచింగ్ క్లాస్ కోసం మంగళవారం తన సోదరుడిని దింపేందుకు ఆమె వెళ్లింది. గుంతలతో కప్పబడిన మధురవాయల్‌లో భయంకరమైన రహదారిని దాటుతుండగా, ఆమె జారిపడి, ప్రయాణీకులిద్దరూ ద్విచక్ర వాహనంపై నుండి పడిపోయారు. ఆమె వెనుకే వెళ్తున్న ఓ ట్రక్కు సమయానికి ఆగలేదు. దీంతో ఆమెను ట్రక్కు ఢీకొట్టింది. శోభన అక్కడికక్కడే మృతి చెందింది, ఆమె సోదరుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. పూనమల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శోభన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం పోరూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి పరారైన లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు