Rahul Dravid Reaction: చిన్న పిల్లాడిలా ఎగిరి గంతేసిన ద్రావిడ్
భారత్ క్రికెట్ లో రాహుల్ ద్రావిడ్ ది ప్రత్యేక స్థానం. సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో సార్లు జట్టుకు ఆపద్భాందవునిగా నిలిచాడు.
- Author : Naresh Kumar
Date : 02-07-2022 - 9:13 IST
Published By : Hashtagu Telugu Desk
భారత్ క్రికెట్ లో రాహుల్ ద్రావిడ్ ది ప్రత్యేక స్థానం. సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో సార్లు జట్టుకు ఆపద్భాందవునిగా నిలిచాడు. ఎలాంటి పరిస్థితిల్లోనైనా ప్రశాంతంగా ఉంటూ తన పని చేసుకునే ఆటగాడిగా పేరు ఉంది. శతకం సాధించిన , జట్టు గెలిచిన సింపుల్ గా చిరునవ్వుతో అభివాదం చేస్తాడు.
అలాంటి ద్రావిడ్ చిన్న పిల్లాడిలా ఎగిరి గంతేయడం ఎప్పుడైనా చూసారా…ద్రావిడ్ నుంచి ఇలాంటి రియాక్షన్ భారత్ , ఇంగ్లాండ్ టెస్ట్ సందర్భంగా చోటు చేసుకుంది. మిగతా కోచ్ ల మాదిరి ఎవరైనా ఆటగాడు సెంచరీ చేస్తేనో.. వికెట్ తీస్తేనో నానా హంగామా చేసే రకం కాదు ద్రావిడ్. అంత కామ్ గా ఉండే ద్రావిడ్.. ఇండియా-ఇంగ్లాండ్ టెస్టులో మాత్రం ఎగిరిగంతేశాడు. ద్రావిడ్ లో ఈ అనూహ్య మార్పునకు కారణం రిషభ్ పంత్.
ఎడ్జబాస్టన్ టెస్టులో రిషభ్ పంత్ సెంచరీ చేసిన తర్వాత రాహుల్ ద్రావిడ్.. పెవిలియన్ లో తన సీట్ లో కూర్చున్నవాడు కాస్తా లేచి సంతోషంగా నవ్వుతూ చేతులు పైకెత్తుతూ పంత్ ను అభినందించాడు. సాధారణంగా ద్రావిడ్ నుంచి ఈ తరహా సెలబ్రేషన్ ఎపుడూ చూసి ఉండరు.
ఇంగ్లాండ్ తో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ 98 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. సీనియర్ ప్లేయర్స్ అందరూ నిరాశపరిచిన వేళ కనీసం 200 రన్స్ అయినా చేస్తారా అనుకున్నారు. ఇలాంటి సమయంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. జడేజాతో కలిసి 222 పరుగుల భాస్వామ్యాన్ని నెలకొల్పాడు. వన్డే తరహాలో ఆడిన పంత్ 89 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. జట్టుకు భారీ స్కోరు అందించినందుకు ద్రావిడ్ కూడా తన ఆనందాన్ని దాచుకోలేకపోయాడు. పంత్ సెంచరీ పూర్తి కాగానే తన సీట్లోంచి లేచి మనస్పూర్తిగా నవ్వుతూ అభినందించాడు. పంత్ సెంచరీ చేసిన సమయంలో పెవిలియన్ అంతా చప్పట్లతో మార్మోగింది. రాహుల్ ద్రావిడ్ సెలబ్రేషన్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
You gotta be Rishabh Pant to make Rahul Dravid celebrate like that, what a knock!pic.twitter.com/buhmslVry6
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 1, 2022