HashtagU Telugu
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄South News
  • ⁄Red Ants Are Attacking The Residents Of Odisha

Red Ants : ఒడిశా వాసులపై దండ యాత్ర చేస్తున్న ఎర్ర చీమలు

చీమ చీమ ఎందుకు కుట్టావు అంటే.. నా బంగారు పట్టలో వేలు పెట్టావంటే నేను ఎందుకు కుట్టను అని మన పెద్దలు

  • By Prasad Updated On - 10:58 AM, Tue - 6 September 22
Red Ants : ఒడిశా వాసులపై దండ యాత్ర చేస్తున్న ఎర్ర చీమలు

చీమ చీమ ఎందుకు కుట్టావు అంటే.. నా బంగారు పట్టలో వేలు పెట్టావంటే నేను ఎందుకు కుట్టను అని మన పెద్దలు చిన్నతనంలో చెప్పినట్లు.. అచ్చం అలాంటి సీన్ ఒడిశాలో రిపీట్ అయ్యింది. చీమలు దెబ్బకు ఏకంగా ఊరు ఊరు మొత్తం ఖాళీ చేసి వెళ్లి పోయాయి. అవును మీరు చదివింది నిజమే. ఆ చీమల దండుకు గ్రామం మొత్తం వామ్మో మేము ఇక కుట్టించుకోలేము అంటూ పారిపోతున్నారు. అసలు చీమలు నిజంగానే దండయాత్ర చేస్తాయా అంటే ఏమో అని టక్కున సమాధానం చెబుతాం. కానీ ఈ స్టోరీ చూస్తే మీక్కూడ కొంచం ఆశ్చర్యంగానే అనిపించోచ్చు.

చీమల బాబోయ్..ఎర్ర చీమలు

చీమలు బాబోయ్‌ చీమలు. భరించ లేకపోతున్నాం. ఊరు వదిలి వెళ్లిపోవాల్సిందే. మునుపెన్నడూ ఇలాంటి చీమల దండుని చూడనే లేదు’ ఇదీ.. పూరీ జిల్లా పిప్పిలి మండలం చంద్రాదెయిపూర్‌ పంచాయతీ బ్రాహ్మణ సాహి గ్రామస్తుల నోటి వెంట నుంచి వస్తున్న మాటలు. ఆ గ్రామంలో చీమలు దండెత్తుతున్నాయి. అక్కడున్న వారిని ఘాటుగా కుడుతున్నాయి. గత రెండు నెలలుగా చీమల వేధింపులు భరించలేదక గ్రామస్తులు మూటాముల్లె సర్దకొని వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.

మొదట్లో లైట్ తీసుకున్నారు.. ఇప్పుడు అయ్యా, అమ్మో అంటున్నారు

చీమలు మొదట ఇళ్లలోకి వచ్చినప్పుడు గ్రామస్థులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ క్రమంగా వాటి సంఖ్య పెరుగుతోంది. అలాగే మనుషులపై ఎక్కువగా దాడి చేస్తుండడం వల్ల భయాందోళనకు గురవుతున్నారు. ఎర్రచీమల బెడద భరించలేక కొందరు గ్రామస్థులు ఇప్పటికే వేరే ప్రాంతానికి వలస వెళ్లారు. చీమల నివారణకు క్రిమిసంహారక మందులు వాడినప్పటికీ ప్రయోజం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఇప్పటికే అనేక ఇళ్లలోని మట్టిగొడల్లో అవి తిష్టవేశాయి. రెండు నెలలుగా చీమలు గ్రామస్థులకు చుక్కలు చూపిస్తున్నాయి.

తమిళనాడులో ఇదే పరిస్థితి…

తమిళనాడులోని అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాలపై సైతం ఇటీవల చీమల దండు వీరవిహారం చేసింది. ‘ఎల్లో క్రేజీ యాంట్స్‌’ అని పిలిచే ఆ చీమలు దిండుక్కల్‌ జిల్లా కరంతమలై రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిసరాల్లోని సుమారు ఏడు గ్రామాలపై దండయాత్ర చేశాయి. పంటపొలాల్ని నాశనం చేస్తుండడం, రైతులకు చెందిన మేకలు, పశువులు, ఎద్దులకు హాని చేస్తున్నాయి. ఎలుకలు, పిల్లులు, కుందేళ్లనూ స్వాహా చేస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం కొందరు నిపుణులను పిలిపించి.. వాటి నివారణకు చర్యలు చేపట్టడం మొదలు పెట్టింది. మొత్తానికి తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలను ఎర్ర చీమలు భయపెడుతున్నాయి.

Tags  

  • Odissa
  • red ants
  • tamilnadu

Related News

Erode East Byelection: కాంగ్రెస్ అభ్యర్థి ఇళంగోవన్‌కు కమల్ హాసన్ మద్దతు

Erode East Byelection: కాంగ్రెస్ అభ్యర్థి ఇళంగోవన్‌కు కమల్ హాసన్ మద్దతు

వచ్చే నెల 27న తమిళనాడులోని ఈరోడ్ తూర్పు నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక( Erode East yelection)లో డీఎంకే సారథ్యంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (ఎస్‌పీఏ) అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఈవీకేఎస్ ఇళంగోవన్ బరిలోకి దిగారు. రోడ్ ఈస్ట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి బేషరతుగా మద్దతు ఇవ్వాలని నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) నిర్ణయించుకున్నారు.

  • cracker blast: తమిళనాడులో భారీ పేలుడు.. నలుగురు మృతి

    cracker blast: తమిళనాడులో భారీ పేలుడు.. నలుగురు మృతి

  • Road Accident : లోయ‌లో ప‌డ్డ అయ్య‌ప్ప భ‌క్తుల వాహ‌నం.. 8 మంది మృతి

    Road Accident : లోయ‌లో ప‌డ్డ అయ్య‌ప్ప భ‌క్తుల వాహ‌నం.. 8 మంది మృతి

  • Road Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

    Road Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

  • Cyclone Mandus: తీవ్ర తుఫాన్ గా మాండూస్.. 3 రాష్ట్రాలకు అలర్ట్‌

    Cyclone Mandus: తీవ్ర తుఫాన్ గా మాండూస్.. 3 రాష్ట్రాలకు అలర్ట్‌

Latest News

  • Smart Phone: స్మార్ట్ ఫోన్ తో గుండెకు చేటు

  • Fake Currency : కోల్‌క‌తా భారీగా న‌కిలీ కరెన్సీ ప‌ట్టివేత‌.. పోలీసులు అదుపులో ఇద్ద‌రు నిందితులు

  • Gandhi burned: దేశమా సిగ్గుపడు.. గాంధీని కాల్చి, గాడ్సే కు జైకొట్టి!

  • YSRCP MLA’S : వైసీపీలో ఫోన్ ట్యాపింగ్ మంట‌లు.. సొంత పార్టీ ఎమ్మెల్యేల‌పై అధిష్టానం నిఘా..!

  • Kuppam : కుప్పం మున్సిపల్ స‌మావేశాన్ని బ‌హిష్క‌రించిన వైసీపీ కౌన్సిల‌ర్లు.. కార‌ణం ఇదే..?

Trending

    • Reverse Aging: ఎలుకల్లో ‘రివర్స్ ఏజింగ్’.. ఇక మనుషులే తరువాయి!

    • Indian Flag : జ‌న‌వ‌రి 26 , ఆగ‌స్ట్ 15 వేడుక‌ల్లో త్రివ‌ర్ణ ప‌తాకం ప్రోటోకాల్ ఇలా..!

    • Bad Cholesterol : శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ భరతం పట్టే ఫ్రూట్స్ ఇవే..

    • Hello Alexa: సల్లూ భాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అలెక్సాపై వెరైటీ ప్రశ్నల వర్షం!

    • ChatGPT : చాట్‌ జీపీటీని ఢీకొనేందుకు గూగుల్ స్పారో..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: