Rajinikanth:సూపర్ స్టార్ పొంగల్ గిఫ్ట్
సంక్రాంతి పండుగ నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఫాన్స్ కి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు.
- By Hashtag U Published Date - 11:20 PM, Fri - 14 January 22

సంక్రాంతి పండుగ నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఫాన్స్ కి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. తనని చూడడానికి తన ఇంటిదగ్గరికి వచ్చిన ఫాన్స్ కోసం తలైవా బయటకి వచ్చి అభివాదం చేసి పలకరించారు. తనకోసం వచ్చిన వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని రజనీ తెలిపారు. రజనీ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
దేశంలో పరిస్థితులు సరిగా లేనందున ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని, ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూనే సంక్రాంతి పండుగను చేసుకోవాలని ప్రజలకు సూచిస్తూ తలైవా ట్వీట్ చేసాడు.
మనమందరం భయంకరమైన, ప్రమాదకరమైన కాలంలో జీవిస్తున్నామని, కరోనా వైరస్ బారిన పడుతున్న వారిసంఖ్య రోజురోజుకి పెరుగుతోందని, ఈ వైరస్ నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి వైద్యులు సూచించిన అన్ని జాగ్రత్తలు పాటించాలని తలైవా పిలునిచ్చారు. మన ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదని చెప్పిన సూపర్ స్టార్ ప్రజలందరికీ పొంగల్ శుభాకాంక్షలు తెలిపారు. రజనీ మెసేజ్ తమకు ఫెస్టివల్ గిఫ్ట్ లాంటిదని రజనీ ఫాన్స్ రీట్వీట్ చేస్తున్నారు.
Pongal Greetings By Rajinikanth
— Rajinikanth (@rajinikanth) January 14, 2022