Drunkers: కేరళ పోలీసుల పనిష్ మెంట్.. మందుబాబులకు వింత శిక్ష!
మందుకొట్టి వాహనాలు నడుపుతున్న వారితో (Drunkers).. పాఠశాల విద్యార్థుల తరహాలో వారితో ఇంపోజిషన్ రాయించారు.
- By Balu J Published Date - 12:16 PM, Tue - 14 February 23

మందుకొట్టి వాహనాలు నడుపుతున్న వారితో (Drunkers).. పాఠశాల విద్యార్థుల తరహాలో వారితో ఇంపోజిషన్ రాయించారు. ఆదివారం కొచ్చిలో ఓ ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కేరళ హైకోర్టు (Kerala Highcourt) జోక్యం చేసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. అప్రమత్తమైన పోలీసులు సోమవారం తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో పట్టుబడిన మందుబాబులకు (Drunkers) త్రిపునితుర పోలీసులు వింత శిక్ష వేశారు. ‘ఇకపై తాగి డ్రైవింగ్ చేయను’ అని వారితో వెయ్యిసార్లు రాయించారు. మందుబాబులంతా చేసేది లేక పోలీస్ స్టేషన్‌లో నేల మీద కూర్చొని ఇంపోజిషన్ రాశారు. ఇంపోజిషన్ రాసినప్పటికీ వారికి అసలు శిక్ష తప్పదని పోలీసులు వెల్లడించారు. మోటారు వాహన చట్టం కింద కేసులు నమోదు చేసి వారి (Drunkers) లైసెన్సులను సస్పెండ్ చేయనున్నామని చెబుతున్నారు.
Also Read: Rose Flowers: లవర్స్ డే క్రేజ్.. ముంబై నుంచి 188 టన్నుల పూల ఎగుమతి!