Rose Flowers: లవర్స్ డే క్రేజ్.. ముంబై నుంచి 188 టన్నుల పూల ఎగుమతి!
తరతరాలుగా వస్తున్న ప్రేమికుల దినోత్సవంలో ఈ రోజా పూలు ప్రత్యేకమే.
- Author : Balu J
Date : 14-02-2023 - 11:59 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రేమికుల దినోత్సవం అంటే రోస్ ఫ్లవర్స్ (Rose Flowers).. రోజ్ ఫ్లవర్స్ అంటే ప్రేమికుల దినోత్సవం. తరతరాలుగా వస్తున్న ప్రేమికుల దినోత్సవంలో ఈ రోజా పూలు ప్రత్యేకమే. టెక్నాలజీ మారినా, ప్రేమికుల ఆలోచనలు మారినా వాలంటైన్స్ డే (Lovers Day) వేడుకల్లో ఈ పూలదే టాప్ ప్లేస్. ఫారిన్ కంట్రీస్ లోనే కాకుండా మన దేశంలోనూ రోస్ ఫ్లవర్స్ (Rose Flowers) మెచ్చిన ప్రేమికులున్నారు. అందుకే ఈ పూలకు ఓ ప్రత్యేకమైన డిమాండ్.
ఈ వాలెంటైన్స్ పురస్కరించుకొని ముంబై విమానాశ్రయం నుండి దాదాపు 188 టన్నుల పూల (Rose Flowers)ను వివిధ అంతర్జాతీయ మరియు దేశీయ గమ్యస్థానాలకు పంపారు. వీటిలో ఎక్కువగా రోజ్ ఫ్లవర్స్ వున్నాయి. జనవరి 15 మరియు ఫిబ్రవరి 12 మధ్య లండన్, బీరుట్, నెదర్లాండ్స్ మొదలైన అంతర్జాతీయ గమ్యస్థానాలకు దాదాపు 110 టన్నుల పువ్వులు, దేశీయ ప్రదేశాలకు 55 టన్నులు పంపబడ్డాయి.
Also Read: Natural Star Nani: ‘ఓరి వారి’ నా కెరీర్ లో బెస్ట్ సాంగ్.. విజువల్ గా స్టన్నింగా ఉంటుంది!