Actor Vijay : విజయ్ పార్టీ ఫై PK కీలక వ్యాఖ్యలు
- By Sudheer Published Date - 03:22 PM, Thu - 22 February 24

తమిళ్ హీరో విజయ్ (Vijay) రీసెంట్ గా తన పొలిటికల్ ఎంట్రీ ని ప్రకటించి అభిమానుల్లో సంతోషం నింపిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కళగం(Tamilaga Vetri Kalagam) పేరుతో కొత్త పార్టీ ని ప్రకటించారు. 2026 ఎన్నికలను టార్గెట్ గా ఆయన బరిలోకి దిగబోతున్నాడు. ఈ క్రమంలో విజయ్ పార్టీ కోసం ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పనిచేయబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తున్న తరుణంలో ఈ వార్తలపై PK క్లారిటీ ఇచ్చారు.
‘విజయ్ కోరుకున్నప్పటికీ ఆయనకు నేను సలహాలు, సూచనలు ఇవ్వలేను. నా సలహాలు, సూచనలు గౌరవించేవారి కోసమే నేను పనిచేస్తా’ అని తేల్చి చెప్పారు. అంటే విజయ్ పార్టీ కోసం PK పనిచేసేందుకు ఏమాత్రం ఇష్టంగా లేరని అర్ధం అవుతుంది. మరి పలు రాజకీయ పార్టీలకు పనిచేసి..ఆ పార్టీ ల విజయంలో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్…విజయ్ కోసం ఎందుకు పనిచేయడం లేదని అంత మాట్లాడుకుంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటే.. విజయ్ ప్రకటించిన పార్టీ కి సంబదించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. తమిళగ వెట్రి కళగం పార్టీ పేరులో స్వల్ప మార్పు చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ పేరులో అదనంగా ‘క్’ అనే అక్షరాన్ని యాడ్ చేయాలనీ భావిస్తున్నారట. పార్టీని ఇంగ్లీష్‌లో టీవీకే అని పిలుస్తున్నారు. దీనిపై తమిళనాడులోని కొన్ని పార్టీల నుండి వ్యతిరేకత వస్తోంది. దీంతో విజయ్ తన పార్టీ పేరులో చేంజ్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది. తమిళనాట తమిళగ వాల్వురిమై కట్చి అనే పేరుతో ఇప్పటికే ఒక పార్టీ ఉంది. ఆ పార్టీని కూడా ఇంగ్లీష్‌లో టీవీకే అని పిలుస్తున్నారు. ఇక విజయ్ పార్టీని కూడా ఇదే పేరుతో పిలుస్తుండటంతో తమకు ఇబ్బంది కలుగుతుందని వారు అభ్యంతరం తెలుపుతున్నారు. దీంతో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం పేరులో ‘క్’ అనే అక్షరాన్ని జోడించాలని నిర్ణయించుటకున్నారట. దీంతో ఇక నుండి తమిళగ వెట్రిక్ కళగం అని పిలవాలని పార్టీ వర్గాలు చెపుతున్నాయి.
Read Also : Kishan Reddy:మేడారం జాతరకు జాతీయ పండుగ గుర్తింపు సాధ్యం కాదుః కిషన్ రెడ్డి