Karnataka: ఆదివాసీలపై రోజురోజుకు పెరుగుతున్న పోలీసుల దాడులు
- Author : hashtagu
Date : 04-01-2022 - 2:28 IST
Published By : Hashtagu Telugu Desk
కర్ణాటకలో స్మగ్గ్లింగ్ చేస్తున్నారనే నెపంతో తమపై కాల్పులు జరుపుతున్నారని ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇటీవలే కర్ణాటకలోని పెరియపట్నా అటవీప్రాంతం లో బసవ అనే ఓ అధివాసి వ్యక్తిని పోలీసులు కాల్చారు. నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బసవ ఓ మీడియా సంస్థకు ఘటనను వివరించారు. పోలీసులు తనపై పాత కక్షతో అతనిని కాల్చారని ఆ తర్వాత గంథం చెక్కల స్మగ్గ్లింగ్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు ఇరికించారని అయన ఆరోపించారు.
బసవ మరో ఇద్దరుతో పాటు స్మగ్గ్లింగ్ చేస్తున్నారని సమాచారం అందిన వెంటనే అక్కడికి వెళ్లామని.. బసవ పోలీసుల పై దాడి చేయడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు చెప్పుకొచ్చారు. బసవ తో పాటు ఉన్న మరో ఇద్దరు పరారీ లో ఉన్నటు పోలీసులు తెలిపారు.
తన ఇంటి దెగ్గర చెట్లను ఎందుకు నరికేస్తున్నారని బసవ సోదరి ప్రశ్నించగా ఆమెపై అధికారులు దురుసుగా ప్రవర్తించి దృర్భాషలాడారు. ఆ విషయం తెలుసుకున్న బసవ అధికారులను ప్రశ్నించగా.. అధికారులు బసవ అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే బసవను పోలీసులు కేసులో ఇరికించారని స్థానికులు ఆరోపించారు.