2026 Assembly Elections
-
#India
Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. సీపీఐ, సీపీఎం, విడుతలై చిరుత్తైగళ్ కచ్చి (వీసీకే) పార్టీలు టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించిన విజయ్, ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు గవర్నర్‌ను కలవనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. విజయ్ […]
Date : 08-05-2026 - 4:15 IST -
#India
Tamil Nadu politics: దళపతి విజయ్‌కు భారీ షాక్..
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు తీవ్ర ఉత్కంఠగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లను గెలుచుకుని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 118. కాంగ్రెస్ పార్టీ కలిసినప్పటికీ టీవీకేకు 112 మంది ఎమ్మెల్యేలు (విజయ్ రెండు చోట్ల గెలిచినందువల్ల ఒక స్థానం మాత్రమే లెక్కలోకి వస్తుంది) ఉన్నారు. ఈ నేపథ్యంలో, గవర్నర్ విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తనను కలిసిన రెండు సందర్భాలలోనూ మెజార్టీని అడిగారు. దీంతో కాంగ్రెస్ లాంటి […]
Date : 08-05-2026 - 3:52 IST -
#India
West Bengal: ఇంటి పనిమనిషి నుంచి చట్టసభకు.. పశ్చిమ బెంగాల్‌లో చరిత్ర సృష్టించిన కలితా మాఝీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభంజనం సృష్టించింది. మొత్తం 294 స్థానాలకు గానూ 206 సీట్లు గెలుచుకుని భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ చారిత్రక గెలుపులో ఎందరో కొత్త ముఖాలు వెలుగులోకి రాగా, అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న పేరు కవితా మాజీ. ఒకప్పుడు ఇళ్లలో పనిచేస్తూ నెలకు కేవలం రూ.2,500 సంపాదించిన ఆమె, ఇప్పుడు ఆస్‌గ్రామ్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యురాలిగా ఎన్నికై అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆమె విజయం ఖరారైన […]
Date : 05-05-2026 - 1:52 IST -
#South
M.K. Stalin: సీఎం పదవికి రాజీనామా చేసిన ఎం.కె. స్టాలిన్
తమిళనాడులో రాజకీయ ముఖచిత్రం సంపూర్ణంగా మారిపోయింది. దశాబ్దాలుగా తమిళగడ్డను గుప్పెట్లో పెట్టుకుని శాసించిన ద్రవిడ పార్టీల (డీఎంకే, అన్నాడీఎంకే) కంచుకోటలు బద్దలయ్యాయి. సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ రెండేళ్లలోనే తమిళనాడులో అధికారాన్ని చేజిక్కించుకుంది. తమిళ ఓటర్లు, ముఖ్యంగా జెన్ జీ యువత విజయ్ కు పట్టం కట్టారు. వరుసగా రెండు సార్లు సీఎంగా అధికారిన్ని చలాయించిన స్టాలిన్ తీవ్ర పరాభవాన్ని మూటకట్టుకున్నారు. డీఎంకే పార్టీ రెండో స్థానానికి పరిమితం అయింది. ఎవరూ ఊహించని విధంగా […]
Date : 05-05-2026 - 12:57 IST -
#South
TVK Party: పెరంబూర్ నుండి నామినేషన్ దాఖలు చేసిన దళపతి విజయ్
Tamil Nadu Elections తమిళనాడు రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో ప్రవేశించిన ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్, సోమవారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ పరిణామం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. చెన్నైలోని వ్యాసర్పాడిలో ఉన్న డాక్టర్ అంబేద్కర్ ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో రిటర్నింగ్ అధికారికి విజయ్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. […]
Date : 30-03-2026 - 2:11 IST -
#Cinema
Annamalai : అన్నామలైని అధ్యక్ష పదవి నుంచి తొలిగిస్తారా..?
Annamalai : తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కె. అన్నామలై మూడు నెలల పాటు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో అంతర్జాతీయ సంబంధాలపై అధ్యయనం చేసిన అనంతరం నవంబర్ 28న చెన్నైకి తిరిగి రానున్నారు. అయితే, ఆయన తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, తమిళనాడు బీజేపీలోని ఒక వర్గం ఆయనను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఒత్తిడి తెస్తోంది.
Date : 09-11-2024 - 10:28 IST -
#India
DMK : 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం డీఎంకే సన్నాహాలు.. 200 సీట్లు లక్ష్యం..!
DMK : ప్రస్తుతం డీఎంకేకు అసెంబ్లీలో 133 మంది సభ్యులు ఉండగా, దాని నేతృత్వంలోని భారత కూటమికి 159 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి మొత్తం 234 సీట్లలో 200 సీట్లు కైవసం చేసుకునేందుకు డీఎంకే వ్యూహాలు రచిస్తోంది. పార్టీ ఆఫీస్ బేరర్లు, మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంటేరియన్లు , మాజీ మేయర్లు, డిప్యూటీ మేయర్లు , ఇతర సీనియర్ పార్టీ ఆఫీస్ బేరర్‌లతో సహా అట్టడుగు స్థాయి సంబంధాలు ఉన్న నాయకుల నుండి తీసుకున్న నియోజకవర్గ ఇంచార్జ్‌లను నియమించింది.
Date : 09-10-2024 - 12:16 IST