Underground Mosque: అండర్ గ్రౌండ్‌లో అద్భుత మసీదు.. అన్య మతస్తులకు మెడిటేషన్ గదులు
భూమికి 65 మీటర్ల దిగువన అండర్ గ్రౌండ్‌లో(Underground Mosque) ఈ మసీదును నిర్మించారు.
- By Pasha Published Date - 04:32 PM, Thu - 27 February 25

Underground Mosque: ముస్లింలు చేసే నమాజ్‌లలో అచ్చం యోగాసనాల తరహాలో పలు భంగిమలు ఉంటాయని చెబుతుంటారు. నమాజ్ అనేది అల్లాహ్ ధ్యానం, స్మరణకు సంబంధించిన అంశం. అల్లాహ్‌ను స్మరిస్తూ ముస్లింలు రోజూ ఐదుపూటలా నమాజ్ చేస్తుంటారు. అయితే కేరళలోని ఒక మసీదు ఇతర మతస్తుల కోసం కూడా కీలకమైన ఏర్పాటు చేసింది. ముస్లిమేతరులు మసీదులోకి వచ్చి ప్రశాంతంగా మెడిటేషన్ (ధ్యానం) చేసుకునేందుకు రెండు ప్రత్యేక గదులను ఏర్పాటు చేసింది. ఆ మసీదు పూర్తి వివరాలివీ..
Also Read :Forceful Layoffs : బలవంతపు ఉద్యోగ కోతలు.. ‘ఇన్ఫోసిస్’పై ప్రధాని ఆఫీసుకు ఫిర్యాదులు
కేరళ మసీదు విశేషాలివీ..
- అల్ ముబష్షిరీన్ మసీదు కేరళలోని ఎర్నాకులం జిల్లా కోత మంగళం పట్టణ శివార్లలో ఉంది.
- కేవలం 80 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండటంతో, దీన్ని ప్రపంచంలోనే అతిచిన్న మసీదుగా అభివర్ణిస్తున్నారు.
- భూమికి 65 మీటర్ల దిగువన అండర్ గ్రౌండ్‌లో(Underground Mosque) ఈ మసీదును నిర్మించారు.
- ఈ మసీదులోని ప్రధాన హాల్‌లో నమాజ్ చేస్తారు. ప్రధాన హాల్‌కు కుడి వైపు చివర్లో, ఎడమ వైపు చివర్లో మెడిటేషన్ చేసుకోవడానికి గదులు ఉంటాయి. ఈ గదుల్లో బల్లలు ఉంటాయి. వాటిపై కూర్చొని అన్య మతస్తులు మెడిటేషన్ చేసుకోవచ్చు.
Also Read :Rajamouli : రాజమౌళి విజయాలకు అసలు కారణం క్షుద్ర పూజలా?
- కోత మంగళం పట్టణానికి చెందిన ఎంఏజీఎస్ ఛారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ మసీదును నిర్మింపజేశారు.
- 60 రోజుల్లోనే ఈ మసీదు నిర్మాణ పనులు పూర్తయ్యాయి.
- 2024 ఫిబ్రవరి 3వ తేదీ నుంచే ఈ మసీదు అన్ని మతాల వారికి అందుబాటులోకి వచ్చింది.