Kerala To Dubai : కేరళ టు దుబాయ్ క్రూయిజ్ సర్వీసు.. విమానయానం కంటే చౌక!
Kerala To Dubai : కేరళ టూరిజం రెక్కలు తొడగనుంది.
- Author : Pasha
Date : 18-12-2023 - 10:51 IST
Published By : Hashtagu Telugu Desk
Kerala To Dubai : కేరళ టూరిజం రెక్కలు తొడగనుంది. కేరళ నుంచి నేరుగా దుబాయ్‌కు క్రూయిజ్ సర్వీసులు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. కేరళలోని బేపూర్, కొచ్చిల మీదుగా దుబాయ్ దాకా క్రూయిజ్ సర్వీస్ నడవనుంది. దీంతో దుబాయ్‌కి క్రూయిజ్ సర్వీసును నడపాలనే కేరళ ఎన్నారైల డిమాండ్‌కు(Kerala To Dubai) మోక్షం లభించినట్లయింది. ఈవివరాలను కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ కూడా ధ్రువీకరించారు. ఈ సర్వీసులు దుబాయ్‌లో ఉంటున్న కేరళీయులకు ఎంతో చేదోడుగా నిలువనున్నాయి. పెరుగుతున్న విమాన ఛార్జీల నుంచి ఊరట కూడా లభించనుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఎందుకంటే.. విమాన టిక్కెట్ రేటులో సగం లేదా మూడింట ఒక వంతు ఖర్చుతోనే క్రూయిజ్ షిప్‌లో కేరళ నుంచి దుబాయ్‌కు వెళ్లొచ్చు. విమానం కంటే మూడు రెట్లు ఎక్కువ లగేజీని క్రూయిజ్‌లో తీసుకెళ్లే వెసులుబాటు సైతం ఉంటుంది. క్రూయిజ్ సర్వీస్ ఒకేసారి 1,250 మంది ప్రయాణికులను దుబాయ్‌కు తీసుకెళ్లగలదు. ఈ సేవల కోసం వినియోగించనున్న ప్రత్యేక క్రూయిజ్ నౌక ఇప్పటికే రెడీ అయింది. కేరళ నుంచి లక్షలాది మంది ఉపాధి కోసం విదేశాలకు వెళ్తుంటారనే విషయం మనకు తెలిసిందే.