HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Kerala Suspends 2 Ias Officers Over Violation Of Discipline

IAS Officers : ‘ఐఏఎస్ ఆఫీసర్స్’ మతపరమైన వాట్సాప్ గ్రూప్.. కీలక పరిణామం

రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ నుంచి అందిన అధికారిక నివేదిక ఆధారంగా ఆ ఇద్దరు ఐఏఎస్ అధికారుల సస్పెన్షన్‌కు  సీఎం పినరయి విజయన్(Hindu IAS Officers) ఆదేశాలు జారీ చేశారని వెల్లడించాయి.  

  • Author : Pasha Date : 12-11-2024 - 9:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kerala Ias Officers Gopalakrishnan N Prasanth Hindu Ias Officers Whatsapp Group

IAS Officers : హిందూ ఐఏఎస్ ఆఫీసర్స్’ పేరుతో వాట్సాప్ గ్రూపు ఏర్పాటైన అంశాన్ని కేరళ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇద్దరు ఐఏఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేశారనే అభియోగంతో ఐఏఎస్ అధికారి గోపాల కృష్ణన్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసింది.  ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని సోషల్ మీడియా వేదికగా విమర్శించినందుకు ప్రశాంత్ అనే మరో ఐఏఎస్ ఆఫీసరును కూడా సస్పెండ్ చేసింది. ఈవిధమైన చర్యల ద్వారా గోపాల కృష్ణన్‌, ప్రశాంత్‌లు సివిల్ సర్వీసు అధికారుల క్రమశిక్షణా కోడ్‌ను ఉల్లంఘించారని కేరళ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ నుంచి అందిన అధికారిక నివేదిక ఆధారంగా ఆ ఇద్దరు ఐఏఎస్ అధికారుల సస్పెన్షన్‌కు  సీఎం పినరయి విజయన్(IAS Officers) ఆదేశాలు జారీ చేశారని వెల్లడించాయి.  ప్రస్తుతం కేరళ పరిశ్రమలు-వాణిజ్య శాఖ డైరెక్టర్‌గా ఐఏఎస్ గోపాల కృష్ణన్‌  వ్యవహరిస్తున్నారు. కేరళ వ్యవసాయ-రైతు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఐఏఎస్ ప్రశాంత్ వ్యవహరిస్తున్నారు.

Also Read :Krish got married to Priti Challa : రెండో పెళ్లి చేసుకున్న స్టార్ డైరెక్టర్

ఐఏఎస్ ప్రశాంత్ ఇటీవలే ఫేస్‌బుక్‌లో వివాదాస్పద పోస్ట్ చేశారు. ‘‘సీనియర్ ఐఏఎస్ అధికారి, అడిషనల్ చీఫ్ సెక్రెటరీ ఎ.జయతిలక్ నాకు వ్యతిరేకంగా మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆయన చేస్తున్న ప్రచారానికి ఎలాంటి ఆధారాలూ లేవు. ఒక రకంగా చెప్పాలంటే ఎ.జయతిలక్ మీడియాకు స్పెషల్ రిపోర్టర్‌లా మారారు. నన్ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు. వాస్తవానికి నేను ఇలాంటి విషయాలు పబ్లిక్‌లో చెప్పను. ప్రస్తుతం మరో మార్గం లేక ఇలా చెప్పుకోవాల్సి వచ్చింది. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది కాబట్టి ఈవిషయాన్ని నేను ప్రజలకు వెల్లడిస్తున్నాను’’ అని ఆ పోస్టులో ఐఏఎస్ ప్రశాంత్ ఆరోపణలు చేశారు.

Also Read :Samantha : నాకు తల్లి కావాలని ఉంది.. దానికి వయసుతో సంబంధం లేదు.. సమంత కామెంట్స్..

అయితే ఐఏఎస్ ప్రశాంత్ గతంలో ‘ఉన్నతి’ అనే ఒక ప్రభుత్వ స్కీంను అమలు చేసే విభాగానికి సీఈఓగా వ్యవహరించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సంబంధించిన పలు కార్యక్రమాలను అమలు చేయడం ‘ఉన్నతి’ స్కీం లక్ష్యం. అయితే ‘ఉన్నతి’ స్కీం సీఈవోగా ఐఏఎస్ ప్రశాంత్ ఉన్న టైంలో కొన్ని కీలకమైన ఫైళ్లు మాయం మయ్యాయని  మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై సీఎం విజయన్‌కు సీనియర్ ఐఏఎస్ అధికారి, అడిషనల్ చీఫ్ సెక్రెటరీ ఎ.జయతిలక్ నివేదిక అందజేశారని ఆ కథనాల్లో ప్రస్తావించారు. ఈ కారణం వల్లే ఎ.జయతిలక్‌పై ఫేస్‌బుక్‌లో  ఐఏఎస్ ప్రశాంత్ పోస్టులు పెట్టారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gopalakrishnan
  • IAS Officers
  • kerala
  • N Prasanth
  • WhatsApp group

Related News

The Kerala Story 2

The Kerala Story 2: మరో చీకటి కోణం..ది కేరళ స్టోరీ2 ట్రైలర్‌ ఇంత ఘోరమా

Pinarayi Vijayan  ఫిబ్రవరి 27న విడుదల కానున్న ‘ది కేరళ స్టోరీ 2’ సినిమాపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ చిత్రం కేరళ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా రూపొందించిన విద్వేషపూరిత ప్రచారమని ఆయన అభివర్ణించారు. శాంతియుతంగా ఉండే కేరళను ఉగ్రవాదానికి కేంద్రంగా చూపించే ప్రయత్నం ఈ సినిమా ద్వారా జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. కోర్టులు, దర్

  • Kerala's Hi Lite Group Gift

    Luxury Cars : అబ్బ.. ఉద్యోగులకు లగ్జరీ కార్లు గిఫ్ట్ ఇచ్చిన కంపెనీ! చాల గ్రేట్ కదా !!

Latest News

  • పదేపదే ఆకలి అవుతుందా? అయితే కార‌ణాలివే!!

  • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

  • కాంగ్రెస్ నాయ‌కుల‌కు నోటీసులు పంపిన లోక్‌స‌భ ప్రివిలేజ్ క‌మిటీ!

  • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

  • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd