పేదల కోసం పెళ్లి బట్టలు.. డ్రెస్ బ్యాంక్ ప్రారంభించిన కేరళ వ్యక్తి
కేరళలోని మలప్పురం-పాలక్కడ్‌లో తూతా గ్రామంలో ఉంటున్న 44 ఏళ్ల నాజర్ ఓ డ్రెస్ బ్యాంక్ ప్రారంభించాడు. ఇప్పటి వరకు 155 మంది మహిళలకు పెళ్లి దుస్తులు అద్దెకు ఇచ్చాడు. అలాగని డబ్బులకేం కాదు. ఉచితంగా పెళ్లి దుస్తులు సమకూరుస్తాడు.
- By Hashtag U Published Date - 03:09 PM, Tue - 19 October 21

కేరళలోని మలప్పురం-పాలక్కడ్‌లో తూతా గ్రామంలో ఉంటున్న 44 ఏళ్ల నాజర్ ఓ డ్రెస్ బ్యాంక్ ప్రారంభించాడు. ఇప్పటి వరకు 155 మంది మహిళలకు పెళ్లి దుస్తులు అద్దెకు ఇచ్చాడు. అలాగని డబ్బులకేం కాదు. ఉచితంగా పెళ్లి దుస్తులు సమకూరుస్తాడు. అందులోనూ పెళ్లికి వేసుకునేలాగే చాలా రిచ్‌గా, గ్రాండ్‌గా ఉంటాయి. నాజర్ దగ్గరున్న 600 రకాల పెళ్లి దుస్తుల్లో మూడు వేల రూపాయల నుంచి 60వేల రూపాయల వరకు ధర ఉన్న బట్టలు ఉన్నాయి. ఫుడ్ బ్యాంక్, బుక్ బ్యాంకు మాదిరిగా ఈ డ్రెస్ బ్యాంక్ ప్రారంభించి అందరి మన్ననలు పొందుతున్నాడు.
పెళ్లి దుస్తులను విరాళంగా ఇచ్చే వాళ్లు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. సంపన్న కుటుంబాల్లోని వాళ్లు ఒకటి రెండు సార్లు ధరించి వదిలేస్తారు. అలాంటి వాటిని సేకరించి పేదలకు ఇస్తుంటాడు. ఎవరైనా సరే.. నాజర్ దగ్గరికి వచ్చి పెళ్లి బట్టలు కావాలని అడిగితే చాలు.. ఇచ్చేస్తుంటాడు. మతం, కులం అనేవేవీ చూడకుండా అందరికీ సేవలు అందిస్తున్నాడు. పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చేది. ఆ సమయంలోనే ప్రత్యేకమైన దుస్తులు ధరిస్తారు. కాని, చాలా మంది పేదవాళ్లు అలాంటి బట్టలకు నోచుకోవడం లేదు. అందుకే, డ్రెస్ బ్యాంక్ ప్రవేశపెట్టానంటున్నాడు నాజర్. అంతేకాదు, నీడ లేని పేదవాళ్లకు సైతం షెల్టర్ కల్పిస్తున్నాడు.
Related News

R Subbalakshmi: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత
తెలుగు, తమిళ, మలయాళంతోపాటు బాలీవుడ్లో కూడా నటించిన ప్రముఖ సీనియర్ నటి ఆర్.సుబ్బలక్ష్మి (R Subbalakshmi) కన్నుమూశారు. నవంబర్ 30న ప్రముఖ మలయాళ సినీ నటి ఆర్. సుబ్బలక్ష్మి కన్నుమూశారు.