HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Karnataka Clarifies That There Is No Ban On Sikh Turbans

Turban: సిక్కుల త‌ల‌పాగాపై నిషేధం లేదు.. క‌ర్ణాట‌క క్లారిటీ

సిక్కు విద్యార్థులు త‌ల‌పాగా ధ‌రించి విద్యా సంస్థల‌కు హాజ‌రు కావ‌చ్చని క‌ర్ణాట‌క ప్రభుత్వం స్పష్టం చేసింది. హిజాబ్ ధ‌రించి రాకూడ‌దంటూ హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వులు సిక్కుల‌కు వ‌ర్తించ‌దంటూ క్లారిటీ ఇచ్చింది.

  • Author : Hashtag U Date : 25-02-2022 - 9:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sikh Students
Sikh Students

సిక్కు విద్యార్థులు త‌ల‌పాగా ధ‌రించి విద్యా సంస్థల‌కు హాజ‌రు కావ‌చ్చని క‌ర్ణాట‌క ప్రభుత్వం స్పష్టం చేసింది. హిజాబ్ ధ‌రించి రాకూడ‌దంటూ హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వులు సిక్కుల‌కు వ‌ర్తించ‌దంటూ క్లారిటీ ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన‌ ఆదేశాల నేప‌థ్యంలో త‌ల‌పై ముసుగు వేసుకొని రాకూడ‌దంటూ బెంగ‌ళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీ ఓ సిక్కు విద్యార్థినికి సూచించింది. కాలేజీ స్టేట్ మెంట్ తో ఈ ఆదేశాల‌పై క‌న్ఫ్యూజ‌న్ ఏర్పడింది.

ఈ విష‌య‌ం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది కర్ణాటక రాష్ట్ర ప్రాథ‌మిక విద్యాశాఖ మంత్రి న‌గేష్ స్పందించి వివ‌ర‌ణ ఇచ్చారు. హైకోర్టు ఉత్తర్వులు సిక్కు విద్యార్థుల‌కు వ‌ర్తించ‌వ‌ని చెప్పారు. త‌ల‌పాగాలు ధ‌రించుకోవ‌చ్చంటూ రాజ్యాంగ‌మే వారికి వెసులుబాటు క‌ల్పించింద‌ని అన్నారు. రాజ్యాంగం ప్రకారం వారికి ఆ హ‌క్కు ఉంద‌ని చెప్పారు. దీనిపై క‌ళాశాల యాజ‌మాన్యం కూడా వివ‌ర‌ణ ఇచ్చింది.

ముసుగు తొల‌గించాల‌ని తామేమీ ఆ విద్యార్థినిపై ఒత్తిడి తీసుకురాలేద‌ని చెప్పింది. ముసుగు ధ‌రించ‌డం హైకోర్టు ఉత్తర్వుల‌కు వ్యతిరేకమ‌ని కొంద‌రు విద్యార్థులు చెప్పడంతో ఆ విష‌యాన్ని ఆమె దృష్టికి తెచ్చామ‌ని తెలిపింది.
కాలేజీ మేనేజ్‌మెంట్ ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేద‌ని ఆ విద్యార్థిని త‌ల్లిదండ్రులు కూడా అంగీక‌రించారు. త‌మ‌కు రాజ్యాంగం ప‌రంగా ఉన్న హ‌క్కును వివ‌రించ‌డంతో ఏకీభ‌వించింద‌ని తెలిపారు.

తుది తీర్పు వ‌చ్చే వ‌ర‌కు మ‌త ప‌ర‌మైన చిహ్నాల‌తో త‌ర‌గ‌తులకు హాజ‌రు కాకూడ‌ద‌ని హైకోర్టు గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. దాని అమ‌లు విష‌యంలోనూ ఈ స‌మ‌స్య త‌లెత్తింది. ఇప్పుడు ప్రభుత్వం స్పందించడంతో ఆ వివాదం ఇక్కడితో సద్దుమణిగింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hijab controversy
  • karnataka
  • karnataka government
  • sikh
  • sikh turban

Related News

Wife Kills Husband

Wife Kills Husband : ప్రియుడి కోసం భర్తను కడతేర్చిన భార్య.. గుండెపోటు డ్రామా వెనుక భయంకరమైన నిజం

భర్త చనిపోయిన కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఆశా తన స్నేహితుడైన చంద్రప్పను వివాహం చేసుకోవడం ఈ కేసులో కీలక మలుపుగా మారింది. సాధారణంగా భర్త మరణించిన విషాదం నుండి కోలుకోవడానికి సమయం పడుతుంది

  • Phone Videos

    Videos : ఇకపై మీ ఫోన్లలో ‘ఆ వీడియో ‘లు ఉంటె మీరు నేరస్థులే !!

  • Karnataka to ban social media use for children under 16

    16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేధం: కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం

Latest News

  • బ్రెయిన్ ఫాగ్.. ఇది ఒక వ్యాధా?

  • Gold Price Fall : వార్ నడుస్తున్న బంగారం ధర తగ్గడానికి కారణాలు ఇవే !!

  • Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీంకు సెన్సార్ షాక్

  • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

  • Mega Family : పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మెగా కోడలు

Trending News

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

    • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd