Hijab Row: హిజాబ్ రగడ పై.. కంగనా సంచలన వ్యాఖ్యలు..!
- By HashtagU Desk Published Date - 01:40 PM, Fri - 11 February 22

కర్నాటక హిజాబ్ వివాదం పై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లోకి ఎక్కుతూ మిస్ వివాదం అనే ట్యాగ్‌లో నిత్యం ట్రెండిగ్‌లో ఉంటుంది కంగనా. అయితే ఇప్పుడు తాజాగా హిజాబ్ రగడ పై స్పందిస్తూ.. మీరు ధైర్యం చూపించాలనుకంటే, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి అక్కడ బురఖా ధరించకుండా చూపించండి, స్వేచ్ఛగా జీవించడం నేర్చుకోండి, మిమ్మల్ని మీరు పంజరంలో బంధించుకోవద్దని కంగనా షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఇక కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఉడిపిలోని గవర్నమెంట్ కాలేజీలో మొదలైన హిజాబ్ రగడ దేశవ్యాప్తంగా రచ్చ లేపుతున్న సంగతి తెలిసిందే. కర్నాటకలోని పలు ప్రాంతాల్లో విద్యార్ధులు రెండు వర్గాలుగా విడిపోయి హిజాబ్, కాషాయ వస్త్రధారణలతో కళాశాలలకు రావడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇరు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణ తీవ్రస్థాయికి చేరుకోవడంతో, అప్రమత్తమైన కర్నాటక ప్రభుత్వం, అక్కడి విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించించిన విషయం తెలిసిందే.