Kamal Haasan : రాజ్యసభకు కమల్ హాసన్!
Kamal Haasan : కమల్ హాసన్‌తో పాటు MNM నుంచి మరొకరికి రాజ్యసభ అవకాశం కల్పిస్తామని అధికార ప్రతినిధి వెల్లడించారు
- Author : Sudheer
Date : 12-02-2025 - 1:20 IST
Published By : Hashtagu Telugu Desk
మక్కల్ నీది మయ్యమ్ (MNM) అధినేత, ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan ) త్వరలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కాబోతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కమల్ హాసన్ నేతృత్వంలోని MNM పార్టీ తమిళనాడు అధికార పార్టీ DMKతో పొత్తు పెట్టుకుంది. అప్పట్లోనే సీఎం స్టాలిన్, కమల్ హాసన్‌కు రాజ్యసభ స్థానాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా DMK మంత్రులలో ఒకరు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కమల్ హాసన్‌తో పాటు MNM నుంచి మరొకరికి రాజ్యసభ అవకాశం కల్పిస్తామని అధికార ప్రతినిధి వెల్లడించారు. దీంతో కమల్ హాసన్ రాజకీయ ప్రయాణంలో మరో కీలక ముందడుగు పడనుందనేది స్పష్టమైంది.
Mega DSC : మెగా డీఎస్సీపై సర్కార్ కసరత్తు.. మార్చిలో నోటిఫికేషన్..?
2018లో MNM పార్టీని స్థాపించిన కమల్ హాసన్.. తన పార్టీ ద్వారా స్వతంత్ర రాజకీయ విధానాన్ని ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్లారు. అయితే రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా విజయాన్ని సాధించలేకపోయినా DMKతో పొత్తు పెట్టుకోవడం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు DMK మద్దతుతో రాజ్యసభకు వెళ్లనున్న ఆయన, పార్లమెంటరీ రాజకీయాల్లో ఎలా రాణిస్తారో ఆసక్తిగా మారింది. ఇప్పటికే కమల్ హాసన్ సమకాలీన రాజకీయాలపై పలు విమర్శలు, తనదైన అనుభవాలతో కూడిన అభిప్రాయాలు వెల్లడిస్తూ వస్తున్నారు. రాజ్యసభకు వెళ్లిన తర్వాత కూడా ఆయన తన గళాన్ని మరింత బలంగా వినిపించే అవకాశముంది. ముఖ్యంగా తమిళనాడు సమస్యలు, జాతీయ రాజకీయాలపై ఆయన ఏ విధంగా స్పందిస్తారో అందరూ ఎదురుచూస్తున్నారు.