Karnataka Road Accident: బీదర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…ఐదుగురు హైదరాబాద్ వాసుల దుర్మరణం..!!
కర్నాటకలోని బీదర్ జిల్లా బంగూర్ దగ్గర జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా ఐదురుగు మరణించారు.
- By hashtagu Published Date - 10:33 PM, Mon - 15 August 22

కర్నాటకలోని బీదర్ జిల్లా బంగూర్ దగ్గర జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా ఐదురుగు మరణించారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా హైదరాబాద్ బేగంపేటకు చెందినవారుగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. గిరిధర్ (45) అనిత (30) ప్రియ (15) మహేశ్ (2) జగదీశ్ (35) ఈ ప్రమాదంలో మరణించారు. వీరంతా కలబురిగి జిల్లా గంగాపూర్ దత్తాత్రేయ ఆలయ సందర్శనకు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారు ఓ కంటైనర్ ను వెనకనుంచి బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.