Scholarship: స్కాలర్‌షిప్ డబ్బులతో నిమ్మరసం పంపిణీ.. విద్యార్థినుల మంచి మనస్సు
దేశంలో ఎండలు దంచికొడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతున్నాయి. ఎండలతో పాటు వడగాల్పుల తీవ్రత కూడా బాగా పెరిగింది. వడగాలులు వీస్తుండగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
- Author : Anshu
Date : 20-04-2023 - 8:50 IST
Published By : Hashtagu Telugu Desk
Scholarship: దేశంలో ఎండలు దంచికొడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతున్నాయి. ఎండలతో పాటు వడగాల్పుల తీవ్రత కూడా బాగా పెరిగింది. వడగాలులు వీస్తుండగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఎండాకాలం కారణంగా పశ్చిమబెంగాల్‌లోని బంకురా జిల్లాలోని పాఠశాల బాలికల బృందం సేవా కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే స్కాలర్‌షిప్ డబ్బులను సామాజిక సేవకు ఉపయోగిస్తున్నారు.
కన్యాశ్రీ ప్రకల్ప పేరుతో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తుంది. అయితే ఈ డబ్బులను షర్బత్ అందించడానికి విద్యార్థులు ఉపయోగించుకుంటున్నారు. రాఖ్ ఖమర్ హై స్కూల్ ఆఫ్ ఇండస్ బ్లాక్ విద్యార్ధులు తమ స్కాలర్ షిప్ డబ్బులతో నిమ్మరసం అందిస్తున్నారు. బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులతో పాటు ట్రక్కు డ్రైవర్లకు వీటిని అందిస్తున్నారు. ఎండాకాలం కారణంగా హైవేపై వెళ్లేవారిక నిమ్మరసం అందిస్తున్నారు.
హైవేపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు కూడా నిమ్మరసం అందించారు. దీంతో బాలికలు చేస్తున్న సేవలను పోలీసులు ప్రశంస్తున్నారు. చిన్న పిల్లలు పెద్ద మనస్సుతో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అందరూ అభినందిస్తున్నారు. ఎండలతో అలిసిపోయిన ఎంతోమంది ప్రజలకు చల్లని నమ్మరసం అందించడం మంచి పరిణామం అని అంటున్నారు.అయితే కన్యాశ్రీ ప్రకల్ప పథకం ద్వారా ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం స్కాలర్ షిప్ అందిస్తుంది. అలాగే స్కూల్‌లో డ్రాపౌట్స్‌ను తగ్గించడం, ముందస్తు వివాహలను అరికట్టడం లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
అయితే ప్రస్తుతం ఎండ ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం వేళల్లో ఎండ ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలెవ్వరూ బయటకు రావడం. ఆీఫీసులకు వెళ్లేవారు మాత్రమే బయటకు వస్తున్నారు. మిగతావారు కూడా అవసరమైతే తప్ప బయటకు వస్తున్నారు. దీంతో రోడ్లపై జనసంచారం బాగా తగ్గింది.