Family Politics : ఎన్నికల సమరంలో మాజీ ప్రధాని దూకుడు.. ముగ్గురు బరిలోకి !
Family Politics : ఎలక్షన్లలో ఏదైనా ఫ్యామిలీ నుంచి అతి కష్టం మీద ఒకరిద్దరు పోటీ చేస్తుంటారు.
- By Pasha Published Date - 11:14 AM, Sat - 6 April 24

Family Politics : ఎలక్షన్లలో ఏదైనా ఫ్యామిలీ నుంచి అతి కష్టం మీద ఒకరిద్దరు పోటీ చేస్తుంటారు. కానీ ఒక ఫ్యామిలీ నుంచి ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ మందే పోటీ చేస్తున్నారు. ఆ వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
We’re now on WhatsApp. Click to Join
ఎన్నికల క్షేత్రంలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులను నిలిపిన ఆ కుటుంబం గురించి తెలుసుకోవాలంటే మనం కర్ణాటకకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడున్న మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ పార్టీ అధినేత దేవెగౌడ కుటుంబంలోని రాజకీయ నేతల సమాచారాన్ని కూడగట్టాలి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో దేవెగౌడ కుటుంబానికి చెందిన ముగ్గురు జేడీఎస్(Family Politics) పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. దేవెగౌడ కుటుంబానికి చెందిన ముగ్గురు ఎన్నికల బరిలో ఉండటం ఇది వరుసగా రెండోసారి. ఈ ఎలక్షన్లలో బీజేపీ- జేడీఎస్ పొత్తు పెట్టుకున్నాయి. రాష్ట్రంలో 28 లోక్‌సభ స్థానాలు ఉండగా, జేడీఎస్‌కు 3 కేటాయించారు. దక్షిణ కర్ణాటకగా భావించే పాత మైసూర్ ప్రాంతంలో జేడీఎస్‌కు మంచి పట్టు ఉంది. ఇక్కడ దేవెగౌడకు చెందిన వొక్కళిగ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది.
- దేవెగౌడ కుమారుడు, మాజీ సీఎం హెచ్‌డీ కుమార స్వామి మాండ్య నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇదే మాండ్య నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సినీ నటి సుమలత బీజేపీ మద్దతుతో గెలిచారు. పొత్తులో భాగంగా ఈసారి మాండ్య నియోజకవర్గాన్ని జేడీఎస్‌కు బీజేపీ వదిలేసింది. దీంతో సుమలత పోటీ నుంచి తప్పుకొని బీజేపీలో చేరారు. ఫలితంగా మాండ్యలో హెచ్‌డీ కుమార స్వామికి తిరుగులేకుండా పోయింది.
- ఈ ఎన్నికల్లో కుమారస్వామి మాండ్య నుంచి గెలిస్తే చెన్నపట్న ఉప ఎన్నికలో ఆయన కుమారుడు నిఖిల్ పోటీ చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి.
Also Read : Israel Vs Iran : అమెరికా పక్కకు తప్పుకో.. ఇజ్రాయెల్ పనిపడతాం : ఇరాన్
- దేవెగౌడ అల్లుడు ప్రముఖ కార్డియాలజిస్టు సీఎన్ మంజునాథ బెంగళూరు రూరల్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
- దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్న .. హసన్ లోక్‌సభ స్థానం నుంచి మరోసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. గతంలో హసన్ నుంచే ప్రజ్వల్ రేవన్న జేడీఎస్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు.
- మాజీ ప్రధాని దేవెగౌడ ఇప్పటికే కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు.
- దేవెగౌడ కుమారుడు, మాజీ సీఎం కుమారస్వామి చన్నపట్న నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. బెంగళూర్ రూరల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి చన్నపట్న వస్తుంది.
- గత అసెంబ్లీలో కుమారస్వామి భార్య అనిత రామనగర నుంచి ఎమ్మెల్యేగా ఉండేవారు.
- దేవెగౌడ పెద్ద కుమారుడు ప్రజ్వల్ తండ్రి HD రేవన్న హోలెనర్సిపుర నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.
- HD రేవన్న భార్య భవాని రేవన్న హసన్ జిల్లా పరిషత్ సభ్యురాలిగా ఉన్నారు.
- HD రేవన్న కొడుకు సూరజ్ ఎమ్మెల్సీగా ఉన్నారు.
- లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి ఇలా ఎక్కడ చూసినా దేవెగౌడ కుటుంబానికి ప్రాతినిథ్యం ఉంది.